ప్రతి ఒక్కరూ ఉగ్రనరసింహులు కావాలి

కెసిఆర్‌ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కదలాలి

నారసింహుడిని ముంచి రియల్‌ వ్యాపారం చేస్తున్న కెసిఆర్‌

కెసిఆర్‌ గద్దె దిగితేనే తెలంగాణకు విముక్తి

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగగురేస్తామన్న బండి

కెసిఆర్‌ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలన్న ఈటెల

యాదాద్రి భువనగిరి,అగస్టు2 ( జనంసాక్షి ) : గోల్కొండ కోట విూద కాషాయ జెండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన ఆయన.. యాదాద్రి జిల్లా వంగపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. చార్మినార్‌ వద్ద సభ పెట్టి సత్తా చాటామన్న బండి సంజయ్‌.. బీజేపీ గెలవగానే తొలుత భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పారు. ప్రతి కార్యకర్త ఉగ్రనరసింహ స్వామి అవతారమెత్తి కేసీఆర్‌ను గద్దెదించాలని పిలుపునిచ్చారు.

ప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్‌ వణికిపోతుండని బండి సంజయ్‌ అన్నారు. మూడో విడత సంగ్రామ యాత్ర యాదగిరిగుట్ట నుంచి ప్రారంభించడంతో సీఎంకు భయం పట్టుకుందని చెప్పారు. లక్ష్మీ నరసింహ స్వామిని ముంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన తన గతి ఏమవుతుందోనని ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నాడని అన్నారు. కేసీఆర్‌ సీఎం హోదాలో ఢల్లీికి పోతే షెడ్యూల్‌ ఉండదా అని ప్రశ్నించిన బండి సంజయ్‌.. అసలు ఆయన ఎందుకు హస్తినకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బుక్కెడు బువ్వ కోసం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు గోస పడుతున్నారని బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే ట్రిపుల్‌ ఐటీకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఏం ఒరగబెట్టని కేసీఆర్‌ ఢల్లీి వెళ్లి ఏం చేస్తాడని బండి సంజయ్‌ సటైర్‌ వేశారు. రాష్టాన్న్రి సాధించుకున్నది అవస్థలు పడేందుకేనా అని సీఎంను నిలదీశారు. కేసీఆర్‌ హయాంలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని బండి సంజయ్‌ ఆరోపించారు. రైతులను నిండా ముంచిన ఘనత కేసీఆర్‌ కే చెల్లిందని అన్నారు. ఫ్రీ  యూరియా ఇస్తానని పాలాభిషేకం చేయించుకున్న ముఖ్యమంత్రి ఆ హావిూని నిలబెట్టుకోలేదని అన్నారు. వాసాలమర్రికి అభివృద్ధి కోసం ఇచ్చిన హావిూల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ మూర్ఖపు, చేతగాని పాలన వల్ల చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇప్పటికైనా బీమా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరాన్ని నిండా ముంచిన ఘనత కేసీఆర్‌ కు దక్కిందని సంజయ్‌ విమర్శించారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చుంటే దేశం మొత్తం ఇప్పుడు బీజేపీని నిలదీసేదని అన్నారు. కేసీఆర్‌ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుదామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌ ను మట్టికరిపించే అవకాశం హుజురాబాద్‌ ప్రజలకు దక్కిందని..ఇప్పుడు నల్గొండ జిల్లా ప్రజలకు దక్కబోతోందని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో బండి సంజయ్‌ సంగ్రామ యాత్ర సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ గడ్డవిూద బీజేపీ జెండా ఎగిరేవరకు అండగా ఉంటామని తెలిపినట్లు

చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ రాకెట్‌ వేగంతో దూసుకుపోతోందని..అర్జునుడికి పక్షి కన్ను కనపడినట్టు, తమకు కేసీఆర్‌ ను గ్దదె దించడమే కనపడుతోందన్నారు. నేను కారులో వస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి ఫోన్‌ చేశారు. మేము బీజేపీ వైపు చూస్తున్నాం అని చెప్పారు. 2014 కి ముందు కులం, మతం అనే సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడాం. మళ్ళీ ఇప్పుడు బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కొట్లాడుదాం అని చెప్పాడు అని ఈటల తెలిపారు. ఇనుప కంచెలు..పోలీసుల పహారాలో కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నాడని..ఆయన ఉంటే ప్రగతి భవన్‌ లేదంటే ఫామ్‌ హౌజ్‌లో అని విమర్శించారు. ఎవరిని కదిలించినా..ఒక్కటే నినాదం అని..కేసీఆర్‌ ను బొందపెట్టే నినాదమని అన్నారు.

దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌..ఆ మాట తప్పి మోసం చేశాడని ఈటల రాజేందర్‌  ఆరోపించారు. కానీ మోడీ మాత్ర ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారని చెప్పారు. గిరిజనులపై లాఠీచార్జి చేస్తూ.. ప్రభుత్వం వాళ్ళను హింసిస్తోందని మండిపడ్డారు. దేశంలోని 19 రాష్టాల్లో బీజేపీ ప్రభుత్వం ఉందని..20వ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అంతరించిపోతున్న పార్టీ అని విమర్శించారు.