ప్రతి కుటుంబానికి ఇక అన్ని వసతులతో ఇల్లు

పట్టణాల్లో గృహవసతి వేగం చేయాలన్న బాబు

ప్రతిబుధవారం సవిూక్షిస్తానన్న సిఎం చంద్రబాబు

అమరావతి,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఏపీలో ప్రతి కుటుంబానికి అన్నివసతులతో సొంత ఇల్లు ఏర్పాటు

చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి బుధవారం పట్టణ గృహనిర్మాణంపై సవిూక్ష నిర్వహిస్తానని చెప్పారు. గృహనిర్మాణశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చిన్న పాటి అంశాలను కూడా క్లిష్టం చేయడం సరైందికాదన్నారు. ప్రతిఒక్కరూ జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. పట్టణ గృహనిర్మాణం ఒక స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అని దేశంలో, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రాజెక్టు లేదన్నారు. ఇళ్ల మంజూరు, లబ్దిదారుల ఎంపిక, బ్యాంకు రుణం, విద్యుత్‌, తాగునీరు కనెక్షన్లు, ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ ఏర్పాటు అన్నీ ఒకే వేదిక విూదకు తెచ్చామన్నారు. ప్రతి అంశానికి నిర్దిష్టమైన గడువును నిర్దేశిరచి, గడువులోపల పనులు పూర్తిచేయాలని సూచించారు. రుణాల మంజూరును బ్యాంకర్లు వేగవంతం చేయాలని.. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశర చేశారు. త్వరలోనే పట్టణాలలో లక్ష గృహాలకు సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. బ్యాంకర్లు, డెవలపర్లు, అధికారుల పనితీరును విశ్లేషిస్తానని సీఎం చెప్పారు. ఇళ్ల మంజూరు, లబ్దిదారుల ఎంపిక, ఎ/-లాన్ల తయారీ, పనుల పురోగతిని సవిూక్షించాలని అధికారులకు ఆయన సూచించారు.