ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 4 (జనం సాక్షి);పోషణ మాసం సందర్భంగా ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలని, బరువు తక్కువ ఉన్న పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో పోషకాహారము అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.సోమవారం జిల్లా నూతన సమీకృత కార్యాలయ సమావేశము హాలు లో పోషణ మాసం పై అధికారులతో ప్రతిజ్ఞా నిర్వహించారు. ఇంటింటా పోషణ సంబరాలు , పోషణకు ఐదు సూత్రాలు , పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ పోషణ మాసం సందర్బంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణ, పోషకాహారము, త్రాగు నీరు, పరిసుబ్రత ల పై సమాచారం ఇస్తానని, ప్రతి ఇళ్ళు, బడి, పల్లె, పట్టణం సరైన పోషణ నినాదాలతో మారు మ్రోగేలా చేస్తానని, జన చైత్యన్యం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని ప్రతిజ్ఞా చెయిoచారు. ప్రతి తల్లి కి బిడ్డకు సరైన పోషణ ఆరోగ్యమ ఉండాలని అన్నారు. గ్రామాలలో ఏఎన్ఎంలు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి కాన్పులు అయ్యేవరకు పర్యవేక్షణ సాగిస్తూ పౌష్టికాహారం అందజేయాలన్నారు.రక్తహీనతను నివారించడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని అంటే పప్పులు, ఆకుపచ్చ పాలకూర, పండ్లు, పాలు, పెరుగు, పన్నీర్ మరియు మాంసాహారులైతే గుడ్లు, మాంసం, చేపలు తినాలని, నిమ్మకాయ, ఉసిరికాయ, జామకాయ, ఇతర పుల్లటి పదార్థాలను తీసుకోవటం వల్ల శరీరంలోకి ఇనుము బాగా వస్తుందని,విరోచనాలను నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటిలో పరిశుభ్రత,ఆహారంలో పరిశుభ్రత పాటించాలని, , సురక్షితమైన తాగునీరు తీసుకోవాలన్నారు. కౌమారదశలో ఉన్న బాలికలు, మహిళలు ఋతుక్రమము సమయము వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం పోషణ మాసంనకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. అది కారులందరి చేత పోషణ మాసం నకు సంబందించిన ప్రతిజ్ఞ చేయిoచారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు అపుర్వే చౌహాన్, చీర్ల శ్రీనివాస్, శిశు సంక్షేమ అధికారిని ముసాయిదా బేగం, ఆర్ డి ఓ చంద్రకళ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.