ప్రతి పోలింగ్ స్టేషన్ లలో అన్ని ఏర్పాట్లను చేయాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ స్టేషన్ లలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ నందు పంచాయతి రాజ్ ఈ. ఈ .డి.ఇ లతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ర్యాంపు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ లో త్రాగునీరు, విద్యుత్తు,టాయిలెట్స్ ఇతర సదుపాయాలు పరిశీలించి లేని చోట వాటిని వెంటనే పూర్తి చేయిoచాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేపట్టిన పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామాలలో చేపట్టిన సీసీ రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో ఎక్కడైతే పనులు పెండింగ్ ఉన్నవో అక్కడ మేజర్, మైనర్ రిపేరు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ ఆర్ ఇ జి స్ పనులు ఎంత వరకు వచ్చాయని మండలం వారిగా వివరాలు అడిగి తెల్సుకున్నారు. స్కూల్ వారిగా పనులు పూర్తి చేసి ఆన్లైన్ రికార్డు నమోదు చేయాలన్నారు. జిల్లాలోని పాఠశాలలలో పెండింగ్ పనులను పర్యవేక్షించి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, పి ఆర్ ఈ ఈ ఆంజనేయులు,డి.ఇ.లు ఏ ఇ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు