ప్రతి వారం సమీక్షించుకుంటు సి.సెక్షన్ లను తగ్గిస్తూ సాధారణ ప్రసవాలు పెంచాలి

మహబూబాబాద్ బ్యూరో-జూలై 12(జనంసాక్షి)

ప్రతి వారం వారం సమీక్షించుకుంటూ సి సెక్షన్ లను తగ్గిస్తు సాధారణ ప్రసవాలు పెంచాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక క్యాంప్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో జిల్లా వైద్య  ఆరోగ్య శాఖ అధికారులతో సాధారణ ప్రసవాలు, సి సెక్షన్ పై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వారం సమీక్షించుకుని సాధారణ ప్రసవాలు పెంచి, సి సెక్షన్ ను తగ్గించాలని, మార్పు ఖచ్చితంగా కనపడాలని సూచించారు.  సి సెక్షన్ ఆడిట్ ను వెంటనే పూర్తి చేయాలని, ఏ సబ్ సెంటర్ నుండి ప్రైవేట్ వైపుకు వెళ్తున్నారు గమనించాలని, అక్కడి సబ్ సెంటర్ లలో సిబ్బంది పని తీరును సమీక్షించాలని, ప్రైమి కేసులు ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నాయి అని గమనించాలని,  సబ్ సెంటర్ వారీగా డాటా తయారు చేసి చివర ఉన్న 30 సెంటర్ ల వివరాలు పరిశీలించాలని, అట్టి సెంటర్ లను తనిఖీ చేసి వెనకబడి ఉండడానికి గల కారణాలు తెలుసుకోవాలని తెలిపారు. గర్భిణీలకు ఏ.ఎన్.సి నమోదు సందర్భంలో సాధారణ ప్రసవాలు అయ్యే విధంగా మోటివేట్ చేయాలని, ప్రైవేట్ వైపు వెళ్లకుండా చూడాలని తెలిపారు.  ఓరిఎంటేషన్ క్లాస్ లు నిర్వహిస్తున్నార అని అడిగి తెలుసుకున్నారు. గర్భిణి లకు యోగా, ఫిజియోథెరపీ పై అవగాహన కల్పించాలని తెలిపారు. ఎం.సి.పి.కార్డ్ పై థర్డ్, ఫోర్త్ ఏ.ఎన్.సి. అప్డేట్ చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనీమియా వివరాలు అప్డేట్ చేయాలని తెలిపారు. జిల్లాలో, ప్రధాన ఆసుపత్రిలో ఏప్రిల్, మే, జూన్ నెలవారీగా, జూలై 11 వరకు నమోదు అయిన ప్రసవాల వివరాలను, ప్రైవేట్ ఆసుపత్రులలో జరిగిన ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఈ నెల 4 నుండి 11 వరకు ప్రైమీ కేసులు 30 నమోదు అయ్యాయని, అందులో నార్మల్ అయినవి 18, కాగా సి సెక్షన్ 12 అని, అలాగే నాన్ ప్రైమి కేసులు 51 కేసులు కాగా, నార్మల్ 14, సి సెక్షన్ 37 అయ్యాయని వెంకట్ రాములు కలెక్టర్ కు తెలిపారు. జిల్లాలో 110 ప్రైమి కేసులు నమోదు కాగా, 40 సాధారణ ప్రసవాలు, 70 సి సెక్షన్ అయ్యాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కలెక్టర్ కు తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకట్ రాములు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ. ఉమా గౌరీ, నేతవత్ వెంకన్న, వైదేహి, హెడ్ నర్సు మంజుల, తదితరులు పాల్గొన్నా