ప్రతీ ఒక్కరూ తమ పశువులకు టీకాలు వేయించు కోవాలి అని మండల పశు వైద్య అధికారి డాక్టర్ హర్ష వర్ధన్ .

రాయికోడ్ అక్టోబర్ 31 జనం సాక్షి.పశువులకు వ్యాధులు సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మండల పశు వైద్య అధికారి డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు.పశువులకు లంపి స్కిన్ వ్యాధి రాకుండా టీకాలు వేయడం జరుగుతుందని ప్రతీ ఒక్కరూ తమ పశువులకు టీకాలు వేయించు కోవాలి అని ఆయన అన్నారు. ప్రతీ గ్రామంలో క్యాంపు ను ఏర్పాటు చేసినప్పుడు రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆయన సూచించారు.పశువులకు సంబందించిన ఇంకేమైనా సందేహాలు ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి అని ఆయన తెలిపారు .