ప్రత్యేక ¬దా కోసం విద్యార్థి ఆత్మహత్య
– కర్నూల్ జిల్లాలో విషాధ ఘటన
– ప్రత్యేక ¬దా లేకపోవటంతోనే తన అన్నకు ఉద్యోగం రాలేదు
– అందుకే తాను చనిపోతున్నా అంటూ సూసైడ్‌నోట్ రాసిన మహేంద్ర
– గ్రామంలో నెలకొన్న విషాధఛాయలు
కర్నూల్, సెప్టెంబర్18(జనంసాక్షి) : ఏపీకి ప్రత్యేక ¬దా రానందుకే తన అన్నకు ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాధ ఘటన కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రత్యేక ¬దా రాలేదన్న మనస్తాపంతో పదో తరగతి విద్యార్థి మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆ విద్యార్థి సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళిఏ.. పదో తరగతి చదువుతున్న మహేంద్ర, తన అన్నకు ఉద్యోగం రాలేదన్న కారణంతోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రత్యేక ¬దా వచ్చుంటే, తన అన్నకు ఉద్యోగం వచ్చుండేదని తన సూసైడ్ లేఖలో వివరించాడు. ¬దా రాకపోవడం వల్లే తన అన్న నిరుద్యోగిగా ఉన్నాడని, దీంతో కుటుంబం గడవటం కష్టమైందని మహేంద్ర ఆ లేఖలో తెలిపాడు. అందుకే కుటుంబానికి భారం కాకూడదని నిర్ణయించుకున్నానని తన ఆవేదనను అక్షర రూపంలో వెల్లడించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మహేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ… మహేంద్ర కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మహేంద్ర కుటుంబాన్ని రఘువీరా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతతో కలిసి పరామర్శించారు. మహేంద్ర మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. ప్రత్యేక¬దా కోసం మహేంద్ర ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. మహేంద్ర కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు అతడి సోదరుడుకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. రాహుల్ ప్రధాని కాగానే ¬దా, రైతు రుణమాఫీ చేస్తారని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు.
దిగ్భాంతికి గురైన వైఎస్. జగన్..
ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా రాకపోవడం వల్లే తన అన్న ఉద్యోగం పొందలేకపోయాడన్న మనస్తాపంతో మహేంద్ర అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలుసుకుని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. తన పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఆనందపురంలో ఉన్న వైఎస్ జగన్ కు, కర్నూలు జిల్లా జలదుర్గంలో మహేంద్ర ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పార్టీ నేతలు తెలిపారు. ఆపై మహేంద్ర కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన జగన్ రాష్ట్రానికి ప్రత్యేక ¬దాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పక సాధిస్తుందన్న అభయమిచ్చారు. యువత సంయమనంతో ఉండాలని, తొందరపడి ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవద్దని జగన్ సూచించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైకాపా గెలిచి అధికారంలోకి వస్తుందని, ¬దాను సాధించి తీరుతామని అన్నారు.