ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే సమస్యలు పరిష్కారం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 24  తెలంగాణకు విముక్తి లభించినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఐకాస నేతలు అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో  నిర్వహిస్తున్న రిలే దీక్షలు శనివారం నాటికి 1056వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తే తప్ప,  కేంద్రం దిగిరాదని అన్నారు.