ప్రత్యేక హోదాతోనే నిధులొస్తాయి
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను మోసం చేశాయి
– సీపీఎస్ రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది
– కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తాం
– జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని పోరాటం చెయ్యాలని కోరతాం
– పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి
అమరావతి, సెప్టెంబర్1(హో) : ఏపీకి ప్రత్యేక ¬దా వస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ విజయవాడలో రైల్వే స్టేషన్ నుంచి జింకానా గ్రౌండ్స్ వరకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి రఘువీరారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటికే సీపీఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, ఏపీలో కూడా అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని హావిూ ఇస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సీపీఎస్ రద్దుకు డిమాండ్ చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, సీపీఎస్ నిర్బంధంగా అమలు చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని అన్నారు. అక్టోబర్ 2 లోపు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో ఉద్యోగులతో పాటు కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. సీపీఎస్ రద్దు చేయాలని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ పోరాటం చెయ్యాలని కోరతామని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక ¬దా విషయంలో తెదేపా, బీజేపీలు మాటమార్చాయని అన్నారు. ప్రత్యేక ¬దా ఇవ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగాఉన్నారని రఘువీరా అన్నారు. ప్రత్యేక ¬దా ఇస్తామని హైదరాబాద్ నుంచి రాహల్ గాంధీ ప్రకటన చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాను చాటుతామని రఘువీరా అన్నారు.