ప్రత్యేక హోదాపై ఆగని నిరసనలు

ఉభయసభల్లో టిడిపి,రాజ్యసభలో వైకాపా ఆందోళన

రాజ్యసభలో చర్చకు నోటీసులు

నేడు చర్చకు వెంకయ్య అంగీకారం

తొలుత రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా

పార్లమెంట్‌ వెలపలా నిరసనలు

న్యూఢిల్లీ,జూలై23(జ‌నంసాక్షి): ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వడంతో పాటు విభజన హావిూలన్నీ నెరవేర్చాలని కోరుతూ తెలుగుదేశం,వైకాపా పార్టీ ఎంపీలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇందుకోసం పార్లమెంటు లోపలా వెలపలా నిరసనలు తెలిపారు. టిడిపి ఉభయసభల్లో ఆందోళనకు దిగగా, వైకాపా రాజ్యసభలో ఆందోళన చేసింది. లాగే రాజ్యసభలో చర్చకు ఈ రెండు పార్టీలు నోటీసులు ఇవ్వగా మంగళవారం చర్చకు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు అంగీకరించారు. మరోవైపు ఉదయం పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళన చేసిన ఎంపీలు.. లోక్‌సభ ప్రారంభమయ్యాక సభలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్లకార్డులు పట్టుకుని తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన చేపట్టారు. విభజన హావిూల కోసం ఏపీ ఎంపీలు తమ పోరాటాన్ని కొనసాగించారు. పార్లమెంట్‌లో తమ ఆవేదనను వినిపించిన టీడీపీ ఎంపీలు అదే ఒరవడి కొనసాగించారు. సోమవారం ప్రారంభమైన రాజ్యసభలోనూ టీడీపీ, వైసీపీ ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు వారించినా టీడీపీ, వైసీపీ ఎంపీలు వెనక్కి తగ్గలేదు. టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. ఏపీ సమస్యలపై స్వల్పకాలిక చర్చకు వారు పట్టుబట్టారు. తమ స్థానాల్లో నుంచే వైసీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన విరమించి సభ సజావుగా సాగేలా సహకరించాలని వెంకయ్య కోరారు. విూ గోల ఎవరూ వినడం లేదు. చూడడం లేదు. ఇంకా ఎందుకు అరుస్తారంటూ టీడీపీ, వైసీపీ ఎంపీలపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వెంటనే టీవీ ప్రసారాలు నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. చైర్మన్‌ ఆదేశాలతో రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలు

కొద్దిసేపు ఆపారు. మరోవైపు రాజ్యసభలో విభజన సమస్యలపై చర్చించేందుకు మంగళవారానికి వాయిదా పడింది. ఈరోజు ఉదయం రాష్ట్ర విభజన సమస్యలపై స్వల్పకాలిక చర్చకు టీడీపీ, వైసీపీ ఎంపీలు రాజ్యసభలో నోటీసులు ఇచ్చారు. సభ మొదలవగానే టీడీపీ, వైసీపీ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని, ఈ తీర్మానంపై రేపు చర్చ జరుపుతామని వెంకయ్య నాయుడు తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఆందోళనతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ఏపీ సమస్యలపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలంటూ తెదేపా సభ్యులు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యానాయుడుకి నోటీసులు ఇచ్చారు. దాన్ని స్వీకరించిన ఆయన రేపు చర్చ చేపడతామని ప్రకటించారు. అయితే తామిచ్చిన నోటీసుపై ఈరోజే చర్చ చేపట్టాలని తెదేపా ఎంపీలు పట్టుబట్టారు. వెంకయ్యనాయడు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిణామాల మధ్య సభను మధ్యాహ్నం 2గటంల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. ఇక పార్లమెంట్‌ వెలపలా ప్రత్యేక ¬దా కోరుతూ తెదేపా ఎంపీల ఆందోళన కొనసాగించారు. పార్లమెంటు ఒకటో నంబర్‌ ప్రవేశ ద్వారం, గాంధీ విగ్రహం వద్ద తెదేపా పార్లమెంటు సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రధాని, కేంద్రం ప్రభుత్వం ఏ ఒక్క అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాలు ఇక ముందూ కొనసాగిస్తామని తెలిపారు. ఎన్డీయేకు మెజారిటీ ఉన్నా ఏపీకి ఇచ్చిన విభజన హావిూలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అన్నమయ్య వేషధారణలో ఆందోళనలో పాల్గొన్నారు.

తాజావార్తలు