ప్రత్యేక హోదాపై రాజీపడడం లేదు
విపక్షాల్లాగా రాజకీయాలు చేయడం లేదు: మంత్రి
విజయవాడ,ఆగస్ట్17(జనం సాక్షి ): రాష్ట్రాన్ని అభివృద్ది చేసే విషయంలో టిడిపి రాజీలేని పోరు చేస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రత్యేక¬దాపై తమకే ఎక్కువ బాధ్యత ఉందని, ఇతరపార్టీల్లాగా రాజకీయలబ్ది కోసం తాము పోరాడడం లేదన్నారు. రాజీలేని పోరాటంలో తమకు ఎవరూ సాటిరారని అన్నారు. వైకాపా, కాంగ్రెస్‌లకు చిత్తశుద్ది లేదన్నారు. వారిది కేవలం రాజకీయ పోరాటం అని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక ¬దా అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని అందుకే కేంద్రంపై పోరాడుతున్నామని అన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీ దగా పడిందని, ఏపీకి ¬దా ఇవ్వాల్సిందేనన్నారు. తామువిభజనకోరుకోలేదని, అలాగే తమతో కనీసంగా అయినా నాటి కేంద్ర ప్రభుత్వం సంప్రదించలేదన్నారు. తమ అభీష్ఠానికి వ్యతిరేకంగా విభజన జరిగిప్పుడు కనీసం ఇచ్చిన హావిూలు అమలుచేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వారిదేనని అన్నారు. కాంగ్రెస్ ఆనాడు దగా చేసింది చాలక ఇప్పుడు ప్రత్యేక¬దాపై డ్రామాలు ఆడుతోందన్నారు. వైకాపా కూడా కేవలం రాజకీయ లబ్ది కోసం పాకులాడుతోందన్నారు. ¬దాపై రాష్ట్ర ప్రజల ఆకాంక్షను ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి వివరించామన్నారు. రాష్ట్రం కోసం ఎన్నిసార్లయినా ¬దా అడుగుతూనే ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రుల భావోద్వేగాలను కేంద్రానికి తెలియజేస్తూనే ఉన్నామని అన్నారు.