ప్రత్యేక హోదా కోసం ఎవరూ ప్రాణత్యాగం చేయవద్దు

మోడీయే యూటర్న్‌ తీసుకున్నారు

మోడీ తీరు దారుణంగా ఉంది

కేంద్రం మెడలు వంచి సమస్యలు సాధిస్తాం

ఒంగోలు ధర్మపోరాట సభలో చంద్రబాబు

ఒంగోలు,జూలై28(జ‌నం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా సాధించి తీరుతామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో చేపట్టిన ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ తీరుపై మరోమారు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో పోరాడి అయినా హక్కులు సాధించుకుంటామని అన్నారు. మేము యూ టర్న్‌ తీసుకోలేదని, మేము రైట్‌ టర్న్‌లోనే ఉన్నామని అన్నారు. యూ టర్న్‌ తసీఉకుంది మోడీయేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నమ్మక ద్రోహంపై తిరుపతిలో వెంకన్న సాక్షిగా తొలి ధర్మపోరాట పోరాటం నిర్వహించామని, ఇదినాలుగో సభ అని గుర్తు చేశారు.ఈ సందర్భంగా గత ఎన్నికల ముందు

మోడీ ఇచ్చిన హావిూలకు సంబంధించి క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. పోరాటానికి పోరాటానికి మధ్య ప్రజల్ని చూస్తుంటే.. రాష్ట్ర ప్రజలంతా సంఘటిత శక్తిగా తయారవుతున్నారన్నారు. హక్కులను కాపాడుకుంటామని, అడ్డం వస్తే ఎదురు తిరుగుతామని ప్రజలంతా నినదిస్తున్నారని అన్నారు. ఈ పోరాటం సందర్భంగా ఒక్కోసారి కొందరు భావావేశానికి లోనై త్యాగాలు చేయాలనే ఉద్దేశంతో ఆత్మహత్యలకు పాల్పడు తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో సుధాకర్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ¬దా రాలేదు. న్యాయం జరగలేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని లేఖ రాసి చనిపోయాడని అన్నారు. అంతకుముందు ఆయన ఓ అనాధ ఆశ్రమానికి రూ.5వేలు డొనేషన్‌గా ఇచ్చాడని సీఎం తెలిపారు. పేద కుటుంబంలో పుట్టినా రాష్ట్ర ప్రయోజనాల కోసం, బావితరాల భవిష్యత్తు కోసం ప్రాణాలర్పించాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఈ సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. బతికి ఉండి పోరాడి.. అనుకున్నది సాధించాలని సీఎం ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి.. మన లక్ష్య సాధన దిశగా ముందుకెళ్దాం అని ప్రజలకు సూచించారు. ప్రత్యేక ¬దా కోసం ప్రాణత్యాగం చేసిన సుధాకర్‌కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు, తెదేపా తరఫున మరో రూ.5లక్షలు సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టంచేశారు.

వరంగల్‌ వాసికి అభినందనలు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వాలని కేంద్రాన్ని నిలదీస్తూ దిల్లీలో సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపిన ఉమేశ్‌ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రత్యేక ¬దా, విభజన హావిూలపైనా రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు.

 

తాజావార్తలు