ప్రత్యేక హోదా పేటెంట్‌ కోసం పార్టీల్లో పోటీ

ఎవరికి వారు తామే నిజమైన పోరాటదారులుగా ప్రకటనలు

రాజకీయ లబ్ది కోసం లక్ష్యాన్ని విస్మరించిన పార్టీలు

అమరావతి,జూలై30(జ‌నం సాక్షి ):  ప్రత్యేక¬దా ఉద్యమం ఎవరిని ముంచుతుందో..ఎవరిని కాపాడుతుందో కానీ ఇప్పుడుంతా దీనివెనకే పరుగెడుతున్నారు. అందరూ ఇదే నినాదంగా సాగుతున్నారు. దీనిపై గతంలో యూటర్న్‌ తీసుకున్న అధికార  టిడిపి ఇప్పుడు ప్రత్యేక¬దా పేటెంట్‌ తమేద అన్న రీతిలో దూసుకుని పోతోంది. ఎదుటి పార్టీలను గతంలో విమర్శించిన టిడిపి అదే రీతిలో ఇప్పుడు మళ్లీ ప్రత్యేక¬దాపై ఇతర పార్టీలకు చిత్తశుద్ది లేదని విమర్శిస్తోంది. అయితే ప్రత్యేక¬దాపై ఉమ్మడి పోరాం చేయడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి. ప్రత్యేక¬దాయే లక్ష్‌ఓయమైతే అన్ని పార్టీలను కలుపుకుని పోవడంలో కూడా అధికార టిడిపి ఘోరంగా విఫలమయ్యింది. విపక్షాల అనైక్యతను టిడిపి తనకు అనుకూలంగా వినియోగించు కుంటోంది. అలాగే ఏకాభిప్రాయం లేకుండా పోరాటం చేస్తున్న కారణంగా కేంద్రంలోని బిజెపికి కూడా తమాషా చూస్తోంది. ఇలా ప్రధాన పార్టీలన్నీ 2019 ఎన్నికల సమరానికి తమతమ వ్యూహాలతో ముందుకెళుతున్న వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇలాంటి పరిణామాల మధ్య టీడీపీ ఎంపీల అవిశ్వాస తీర్మానంతో ప్రత్యేక ¬దా అంశం మరోసారి తెరపైకొచ్చింది. ప్రత్యేక ¬దాపై పోరాడింది మేమంటే.. మేమంటూ టీడీపీ, వైసీపీలు వాదిస్తున్నాయి. అసలు ప్రత్యేక ¬దా అంశంలో వైసీపీ ఎంపీలు చేసిన తప్పేంటి? టీడీపీ వేసిన ముందగుడు ఏంటి? జనసేనాని ప్రత్యేక ¬దా కోసం చేసింది ఏమైనా ఉందా? అన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఢిల్లీలో తెలంగాణ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఎపిలో రాజకీయ పార్టీల్లో అనైక్యతను చాటుతున్నాయి. తెలంగాణ ఉద్యమం కోసం అందరినీ కలుపుకుని పోయిన తరహాలో ప్రత్యేక ఉద్యం సాగడం లేదన్నారు. ఆయన అన్నట్లుగానే ఎపిలో రాజకీయ పార్టీల తీరు ఉంది. దీంతో అన్ని పార్టీలు ఏపీలో 2019 ఎన్నికలల్లో గెలుపు లక్ష్యంగా తమ వ్యూహాలు రచిస్తున్నాయి. దీతో ¬దా అంశం ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలకు పెను సవాల్‌గా మారబోతున్నది. ఏపీకి ఎక్కువే న్యాయం చేశామంటూ బీజేపీ వాదిస్తోంది. అవినీతిలో కూరుకుని పోయిన టీడీపీకి అధికారాన్ని దూరం చేస్తామంటూ జనసేన, వైకాపాలు ప్రచారం ముమ్మరం చేశాయి. మళ్లీ సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ¬దా చుట్టూ రాజకీయం నడిపిస్తోంది. ఎన్డీయే ప్రభుత్వంతో అంట కాగినంత కాలం, దానితో చెలిమి చేసినంత కాలం టిడిపి ప్రత్యేక ¬దాపై మిన్నకుంది. దీనిపై ఎవరు మాట్లాడినా ఎదురుదాడి చేసింది. కేంద్ర  వైఖరిపై కఠినంగా వ్యవహరించలేకపోయింది. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగడం.. పార్లమెంట్‌ లోపల కూడా ¬దా అంశంపై పోరాడుతున్నా టిడిపి తీరులో చిత్తశుద్ది కానరావడం లేదు. అయితే ప్రస్తుత  పరిస్థితులు టీడీపీపై ప్రజల్లో ఉన్న సానుకూల భావాన్ని మరింత పెంచాయని ఆ పార్టీ నేతలు విశ్వాసంగా ఉన్నారు.  బీజేపీయేతర పార్టీలతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలు జరపడం, రాష్ట్రానికి  కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరించడం.. తమకు అండగా నిలవాలని కోరడం వంటి పరిణామాలతో ¬దా సాధనకు టీడీపీ కట్టుబడి ఉందన్న సంకేతాలను చంద్రబాబు ఏపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంలో కూడా కేంద్ర వైఖరిని నిలదీయడం తమకు కలసి వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల సందర్భంలో అవినీతి చర్చలో నిలదీయడం ద్వారా  ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని.. ఈ ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిలదీశారు. ఇలా బీజేపీని టార్గెట్‌ చేస్తూ టీడీపీ ¬దా పోరాటంలో ముందుకెళ్లడం పార్టీకి కలిసొచ్చే అంశం అని నేతలు భావిస్తున్నారు. ¬దాపై అందరి కంటే ముందు కేంద్రాన్ని ప్రశ్నించింది తామేనని చెప్పుకుంటున్న ప్రతిపక్ష వైసీపీ ఎంపిలతో రాజీనమాలు చేయించి రాజకీయంగా కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది. తన వాణిని లోక్‌సభలో వినిపించే అవకాశాన్ని కోల్పోయింది. ¬దా విషయంలోనూ ఆ పార్టీ అధినేత జగన్‌ పదేపదే టీడీపీని, చంద్రబాబునే టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించడం కూడా ¬దా అంశాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటోందన్న వాదనకు బలం చేకూర్చుతోంది. ¬దా విషయంలో పోరాడుతోంది తామేనని చెప్పుకుంటున్న వైసీపీ… ఎంపీల రాజీనామాల విషయంలో తప్పటడుగు వేసి  తీరా సమావేశాలు జరుగుతున్న వేళ సభకు వెళ్లే అవకాశం లేకుండా మాజీలుగా మిగిలిపోవడం రాజకీయంగా పెద్దదెబ్బగానే భావించాలి. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటున్న వంకతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లినా పెద్దగా ప్రయెఓజనం కానరాలేదు.  పవన్‌ కళ్యాణ్‌ కూడా అవినీతి విషయంలో టీడీపీని టార్గెట్‌ చేస్తూ ప్రత్యేక¬దాపై నాలుగేళ్లుగా ఎందుకు మౌనం దాల్చారని నిలదీస్తున్నారు. ఇకపోతే వామపక్షాలు కూడా పవన్‌తో జతకట్టాయి. ప్రత్యేక¬దాపై పోరాడుతున్నాయి. ఈ విషయంలో రాజకీయంగా ఎవరికి కలసి వస్తుందన్నది ఇప్పుడే చెప్పలేం. బిజెపి ముందుముందు ఎలాంటి పాచికలు వేస్తుందన్నది కూడా ముఖ్యమే.

 

 

తాజావార్తలు