ప్రధాని సంతకాన్ని ఫోర్జరీ చేసిన టెక్కీ అరెస్టు

హైదరాబాద్‌ : ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ సంతకాన్ని ఫోర్టర్‌ చేసిన బిటెక్‌ విద్యార్థిని సిబిఐ అధికారులు హైదరాబాద్‌లో బుధవారం అరెస్టు చేశారు.లక్నో విశ్వవిద్యాలయంలో సీటును సంపాదించుకోవడానికి అతను ప్రధాని సంతకాన్ని ఫోర్ట్‌ చేశాడు. నిందుతుడిని ఫర్హాన్‌ అక్తర్‌గా గుర్తించారు. ప్రిజనర్‌ ట్రాన్సిట్‌ వారంట్‌ ద్వారా అతన్ని ఢిల్లీకి తరలించే ఏర్పాటు జరుగుతున్నాయి.లక్నో విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ కోసం అక్తర్‌ దరఖాస్తు పెట్టుకున్నాడని . ప్రదాని సిఫార్సు లేఖ అంటూ సంతకం ఫోర్టర్‌ చేసి దానికి జత చేశాడని సిబిఐ అధికారులు చెప్పారు. లక్నో విశ్వవిద్యాలయం అధికారులు అతనికి సీటు ఇచ్చి, సిఫార్సు మేరకు సీటు ఇచ్చామని తెలియజేస్తూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.లక్నో విశ్వవిద్యాలయం అధికారుల లేఖను చూసిన ప్రధాని కార్యాలయం అధికారులు తాము ఏ విద్యార్థికి కూడా సిఫార్సు చేయలేదని జవాబు రాశారు. విచారణ జరిపిన అనంతరం లక్నో విశ్వవిద్యాలయం అధికారులు ప్రధాని కార్యాలయం అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు దర్యాప్తు చేపట్టి అక్తర్‌ను అరెస్టు చేశాడు.సిఫార్సు లేఖ రాయడానికి అక్తర్‌ ప్రధాని లెటర్‌ హెడ్‌ను ఫోర్టర్‌ చేయడానికి సిబిఐ అధికారులు చెప్పారు. అక్తర్‌ హైదరాబాదులోని హిమాయత్‌నగర్‌లో గల ఓ కళాశాలలో బిటెక్‌ పైన లియర్‌ చదువుతున్నట్లు సమాచారం. పర్షాన్‌ ఖాన్‌ ఉత్తరద్రేశ్‌ కు చెందినవాడని తెలుస్తోంది.