ప్రపంచంలోనే అతి పొడవైన కొండచిలువ మృతి
మలేషియా: ప్రపంచంలోనే అతి పొడవైన కొండచిలువ చనిపోయింది. 250 కిలోల బరువు, 8 మీటర్ల పొడవున్న ఈ కొండచిలువ ఆదివారం గుడ్లు పెట్టిన అనంతరం చనిపోయిందని అధికారులు తెలిపారు. దీనిని పెనాంగ్ దీవుల్లోని ఓ చెట్టు కింద పడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం అతిపెద్ద కొండ చిలువగా రికార్డు సృష్టించిన మెడూసా 7.67 మీటర్ల పొడవు ఉండగా… చనిపోయిన కొండచిలువ 8 మీటర్లు ఉంది. 250 కిలోలున్న దీనిని తరలించడానికి అరగంట సమయం పట్టిన్నట్లు తెలిపారు. ఈ కొండ చిలువను వైల్డ్‌లైఫ్ డిపార్ట్‌మెంట్‌కి తరలించాల్సి ఉందని కానీ.. ఇంతలో అది చనిపోయిందని చెప్పారు.