ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్

fmrhv6iu

ఆక్లాండ్ : వరల్డ్‌కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా కొనసాగింది. ఈ మ్యాచ్ ప్రతి క్షణం ఉత్కంఠభరితమే. ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ సమరంలో ఎట్టకేలకు న్యూజిలాండ్ నెగ్గింది. దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ పోరాడి గెలిచింది. ఒక్క బంతి మిగిలి ఉండగానే కివీస్ విజయం సాధించింది.

దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 43 ఓవర్లకే మ్యాచ్‌ను కుదించారు. 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం న్యూజిలాండ్‌కు 298 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. 42.5 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది న్యూజిలాండ్.

ఇక రెండో సెమీస్ విజేతతో ఆదివారం ఫైనల్‌లో న్యూజిలాండ్ తలపడనుంది. వరుసగా ఎనిమిది విజయాలతో న్యూజిలాండ్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. గతంలో ఆరుసార్లు కివీస్ సెమీస్‌కు చేరింది. ఎట్టకేలకు ఏడో ప్రయత్నంలో ఫైనల్‌కు చేరింది. ఇలియట్ 84 పరుగులు చేసి మ్యాచ్ గెలుపుకు కృషి చేశాడు. మెక్‌కల్లమ్ కల్లోలం సృష్టించాడు. అండర్సన్ 58 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌లో వైఫల్యం చెందింది. చేతికి వచ్చిన రెండు క్యాచ్‌లను జారవిడుచుకుంది. చివరకు ఫీల్డింగ్‌లో వైఫల్యం చెంది ఓటమితో కంటతడి పెట్టారు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : గప్తిల్ 34, మెక్‌కల్లమ్ 59, విలియమ్‌సన్ 6, టేలర్ 30, ఇలియట్ 84, అండర్సన్ 58, రాంచీ 8, వెటోరి(నాటౌట్) 7 పరుగులు చేశారు. మోర్కెల్ 3, డుమ్నీ, స్టేయిన్ తలో ఒక వికెట్ తీసుకున్నారు.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : ఆమ్లా 10, కాక్ 14, ప్లెసిస్ 82, రోసో 39, విల్లియర్స్(నాటౌట్) 65, మిల్లర్ 49, డుమ్నీ(నాటౌట్) 8 పరుగులు చేశారు. అండర్సన్ 3, బోల్ట్ 2 వికెట్లు తీశారు.