ప్రపంచశాంతి కోరుతూ పాదయాత్ర చంద్రబాబు

ఆదిలాబాద్‌ : ప్రపంచ శాంతిని కోరుతూ మహారాష్ట్ర వాసులు చేపట్టిన పాదయాత్ర ఈరోజు ఆదిలాబాద్‌ పట్టణానికి చేరుకుంది ఔరంగాబాద్‌ జిల్లా పైఠాన్‌ గ్రామానికి చెందిన 20మంది సభ్యుల బృందం కిందటి ఆగస్టు 15నషిరిడీలో ఈయాత్రను ప్రారంభించారు నాందేడ్‌ తిరుపతి బాసర పుణ్యక్షేత్రాల మీదుగా యాత్ర ఆదిలాబాద్‌ చేరుకున్నట్లు యాత్ర సారథి అశోక్‌ మహరాజ్‌ పెర్కొన్నారు మహారాష్ట్రలోని చంద్రపూర్‌ మహంకాళి ఆలయానికి చేరుకుని యాత్ర ముగిస్తామని ఆయన తెలిపారు ఆథ్యాత్మిక భజనలతో ప్రతిరోజు 20కి.మీ.నడుస్తున్నట్లు చెప్పారు మనవాళి శ్రేయస్సు కోరుతూ ముందుకు  సాగుతున్నామన్నారు.