ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ కీలకం

Untitled-3 Untitled-4

– ఫేస్‌బుక్‌ సీఈవో మాక్‌ జుకర్‌ బర్గ్‌

న్యూఢిల్లీ,అక్టోబర్‌28(జనంసాక్షి):

ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఢిల్లీ ఐఐటీ వి ద్యార్ధులతో ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్న లకు ఆయన సమాధానం ఇచ్చారు. సరదాగా వారి తో ముచ్చటించిన ఆయన పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. భారత్‌కు రావడం సంతోషంగా ఉందన్నా రు. ఆఫ్ఘనిస్తాన్‌ భూకంప బాధితులకు ఫేస్‌బుక్‌ సా యం అందిస్తోందన్నారు. ప్రపంచంలో భారత్‌ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఆ దేశం లేకుండా ప్రపంచ దేశాలతో సంబంధాలు చేపట్టలేమన్నారు. వంద కోట్ల ప్రజలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఐఐటీ దిల్లీలోని టౌన్‌ హాల్‌లో విద్యార్థులతో సమావేశమై వారు అడిగిన ప్రశ్నలకు జుకర్‌బర్గ్‌ సమాధానాలు ఇచ్చారు. జుక ర్‌బర్గ్‌తో ఇష్టాగోష్టిలో 900 మంది విద్యార్థులు, పలు వురు అధ్యాపకులు, ఇతర ప్రతినిధులు పాల్గొ న్నారు. టౌన్‌హాల్‌కు వచ్చిన జుకర్‌బర్గ్‌కు విద్యార్థు లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జుకర్‌బర్గ్‌ మాట్లాడుతూ… భారత్‌లో సందర్శించ డం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంద ర్భంగా జుకర్‌బర్గ్‌ మాట్లాడుతూ… ఎక్కువ ఫేస్‌బుక్‌ వినియోగదారులున్న రెండో పెద్ద దేశం భారత్‌ అని తెలిపారు. భారత్‌లో ప్రతి ఒక్కరిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తేనే ప్రపంచంలో ప్రతి ఒక్కరిని అనుసంధానించటం సాధ్యమవుతుందన్నారు. ఇంట ర్నెట్‌.ఆర్గ్‌ ద్వారా 15 మిలియన్ల మందిని అన్‌లై న్‌లోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రపంచంలో నాలుగు బిలియన్ల మందికి ఇంటర్నెట్‌ సదుపాయం లేదని, ప్రతి ఒక్కరినీ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయటమే తమ లక్ష్యమని వివరించారు.భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలో ప్రతి ఒక్కరితో కనెక్ట్‌ అవ్వాలనే లక్ష్యం ఉన్నప్పుడు భారత్‌ లేకుండా అది సాధ్యం కాదు. భారత్‌లో ప్రజలతో కనెక్ట్‌ అవ్వడం చాలా అవసరం. ఫేస్‌బుక్‌కు భారత్‌ అత్యంత ప్రధానమైన మార్కెట్‌ అన్నారు. ఫేస్‌బుక్‌తో కనీసం ఇంటర్నెట్‌తో అను సంధానం కాలేని వారితో ఎలా కనెక్ట్‌ కావాల నుకుంటున్నారన్న

దానికి ప్రజల్లో అవగాహన తీసుకురావడం చాలా ముఖ్యమన్నారు. మార్క్‌జుకర్‌బర్గ్‌ మంగళవారం  తాజ్‌మహాల్‌ను సందర్శించారు. తాజ్‌ అందాలు అద్భుతమని వర్ణించారు. తాను ఊహించిన దానికన్నా ప్రేమసౌధం అందంగా ఉందన్నారు. ఐఐటి విద్యార్థులతో సమావేశంలో పాల్గొనే కొన్ని గంటల ముందు జుకర్‌ ఇండియా గేట్‌ను సందర్శించారు. రాజ్‌పథ్‌ మార్గంలో ఫేస్‌బుక్‌ స¬ద్యోగులతో కలిసి పరుగు తీసి సందడి చేశారు. ఇండియాగేట్‌ వద్ద పరిగెడుతున్న ఫొటోను జుకర్‌బర్గ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. పోస్టు చేసిన గంటలోనే ఈ ఫొటోకు 60లక్షల లైక్‌లు, 1,90,000 కామెంట్లు రావడం విశేషం.