ప్రపంచ మేటి నగరాలకు దీటుగా ఫ్యూచర్‌ సిటీ

` పదేళ్లలో న్యూయార్క్‌ను మరిపించే మహానగరం కడతా
` ప్రతిష్టాత్మక నగరం గురించి కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు
` చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ ముందు తరాల కోసం ఆలోచించారు.
` అందువల్లే హైటెక్‌ సిటీ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ వచ్చాయి
` అభివృద్ధి పనుల వల్ల నష్టపోయేవారిని అన్నివిధాలా ఆదుకుంటాం
` ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, స్కిల్‌ వర్సిటీలను డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం
` డిసెంబర్‌ నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు ఎఫ్‌సీడీఏ నుంచే చేపడతాం
` రంగారెడ్డిలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన

‘’70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునే పనులు చేయొద్దా? భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి ఏం తక్కువ? అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి చెన్నైకి బుల్లెట్‌ ట్రైన్‌(వయా అమరావతి)కి కేంద్రం ఒప్పుకొంది. ఇక్కడ 500 ఫార్చ్యూన్‌ కంపెనీలు కొలువు తీరాలన్నది నా స్వప్నం. హైదరాబాద్‌లో ప్రస్తుతం 80 ఫార్చ్యూన్‌ కంపెనీలే ఉన్నాయి. ఫ్యూచర్‌ సిటీ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం. ఈ విషయాలకు కోర్టులకు వెళ్లి ఇబ్బంది పడవద్దు. అభివృద్ధి పనుల వల్ల నష్టపోయేవారిని అన్నివిధాలా ఆదుకుంటాం. దక్షిణ భారతంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. అందుకే ఫ్యూచర్‌ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్డు వేయబోతున్నాం. ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, స్కిల్‌ వర్సిటీలను డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం. డిసెంబర్‌ నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు ఎఫ్‌సీడీఏ నుంచే చేపడతాం. సింగరేణికి పదెకరాల భూమి ఫ్యూచర్‌ సిటీలో కేటాయిస్తాం. ఏడాది తిరిగే లోగా సింగరేణి కార్యాలయం నిర్మాణం పూర్తి కావాలి’’ – ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి): ఫ్యూచర్‌ సిటీపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తనకు ఇక్కడ భూములున్నందు వల్లే ఫ్యూచర్‌ సిటీ కడుతున్నారని అంటున్నారని పేర్కొన్నారు.తన కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్‌ సిటీ అని వివరించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌ పేటలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ‘’చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ ముందు తరాల కోసం ఆలోచించారు. అందువల్లే హైటెక్‌ సిటీ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ వచ్చాయి. గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలి. చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నాళ్లు న్యూయార్క్‌, సింగపూర్‌, దుబాయ్‌ గురించి చెప్పుకొంటాం.. మనం కూడా అలా తయారు కావాలి కదా. నాకు పదేళ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా అని అన్నారు.‘’70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునే పనులు చేయొద్దా? భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి ఏం తక్కువ? అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి చెన్నైకి బుల్లెట్‌ ట్రైన్‌(వయా అమరావతి)కి కేంద్రం ఒప్పుకొంది. ఇక్కడ 500 ఫార్చ్యూన్‌ కంపెనీలు కొలువు తీరాలన్నది నా స్వప్నం. హైదరాబాద్‌లో ప్రస్తుతం 80 ఫార్చ్యూన్‌ కంపెనీలే ఉన్నాయి. ఫ్యూచర్‌ సిటీ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం. ఈ విషయాలకు కోర్టులకు వెళ్లి ఇబ్బంది పడవద్దు. అభివృద్ధి పనుల వల్ల నష్టపోయేవారిని అన్నివిధాలా ఆదుకుంటాం. దక్షిణ భారతంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. అందుకే ఫ్యూచర్‌ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్డు వేయబోతున్నాం. ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, స్కిల్‌ వర్సిటీలను డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం. డిసెంబర్‌ నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు ఎఫ్‌సీడీఏ నుంచే చేపడతాం. సింగరేణికి పదెకరాల భూమి ఫ్యూచర్‌ సిటీలో కేటాయిస్తాం. ఏడాది తిరిగే లోగా సింగరేణి కార్యాలయం నిర్మాణం పూర్తి కావాలి’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. దక్షిణ భారతంలో పోర్టులేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే, అందుకే అమరావతితో ఫ్యూచర్‌ సిటీని అనుసంధానం చేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి ఏం తక్కువ అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకే ఫ్యూచర్‌ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్డు వేయబోతున్నామని చెప్పారు. ఫ్యూచర్‌ సిటీ నుంచి చెన్నైకి బుల్లెట్‌ ట్రైన్‌ వయా అమరావతికి కేంద్రం ఒప్పుకుందని హర్షించారు. ఫ్యూచర్‌ సిటీలో 500 ఫార్చ్యూన్‌ కంపెనీలు కొలువు తీరాలన్నది తన కల అని సీఎం రేవంత్‌ చెప్పారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 80 ఫార్చ్యూన్‌? కంపెనీలే ఉన్నాయని గుర్తు చేశారు. ఫ్యూచర్‌ సిటీ విషయంలో చిన్నచిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటామన్నారు. చిన్నచిన్న విషయాలకు కోర్టులకు వెళ్లి ఇబ్బంది పడొద్దని హితవు పలికారు. ఎలాంటి సమస్య ఉన్నా నేను పరిష్కరిస్తా, దీని కోసం ఓ మెకానిజం ఏర్పాటు చేస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూసేలా ప్రపంచంలోని ఇతర నగరాలకు రోల్‌ మోడల్‌ గా నిలిచేలా భారత్‌ ఫ్యూచర్‌ సిటిని అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని.ఇప్పుడు ప్రణాళికా బద్ధమైన నగరం అనగానే అందరికీ చంఢీఘర్‌ గుర్తుకొస్తుందని, రాబోయే రోజుల్లో ప్రణాళికాబద్ధమైన నగరం అంటే భారత్‌ ఫ్యూచర్‌ సిటీ గుర్తుకొస్తుందన్నరు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ లివ్‌-లెర్న్‌ వర్క్‌%-%ప్లే అనే కాన్సెప్ట్‌ తో పరిశ్రమలు, ఆసుపత్రులు, పాఠశాలలు, షాపింగ్‌ మాల్స్‌ అన్ని ఒకే చోట ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. భావితరాల కోసం మన బిడ్డల కోసం వారి బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజు మనందరం కలిసి వేస్తున్న పునాదే ఈ భారత్‌ ఫ్యూచర్‌ సిటీ అని తెలిపారు. ఇది ‘నెట్‌ జీరో కార్బన్‌ సిటీ’. ఇక్కడ పచ్చదనం ఉంటుంది, కాలుష్యం ఉండదు. పరిశ్రమలు వస్తాయి, కానీ పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. రేపటి తరాల కోసం తెలంగాణ కోసం చిత్తశుద్ధితో నిరంతరం కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంతో కలిసి నడవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నా. భారత్‌ ఫ్యూచర్‌ సిటి నిర్మాణంలో పాలు పంచుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మన్‌, ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్‌ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్‌ గుప్తా, మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి, టీయూఎఫ్‌ఐడీసీ ఛైర్మన్‌ చల్లా నర్సింహా రెడ్డి, తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్పర్సన్‌ నిర్మల,ఫ్యూచర్‌ సిటీ డెవలప్మెంట్‌ అథారిటీ కమీషనర్‌ కె.శశాంక, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, సంబంధిత అధికారులు, వివిధ సంస్ధల ఛైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు

 

బతుకమ్మకుంటకు పునరుజ్జీవనం
హైదరాబాద్‌కు చెరువులు, మూసీ గొప్పవరం
` మారిన వాతావరణ పరిస్థితుల వల్లే నగరాల్లో కుండపోత వర్షాలు
` 2 సెం.మీ వర్షం పడితే నగరమంతా అస్తవ్యస్థం
` వరద నీటిని నియంత్రించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరముంది
` బతుకమ్మకుంటను ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): మారిన వాతావరణ పరిస్థితుల వల్లే పలు నగరాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయని, హైదరాబాద్‌లోనూ అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నగరంలో 2 సెం.మీ వర్షం పడితే అస్తవ్యస్థం అవుతోందన్నారు. వరద నీటిని నియంత్రించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరముందన్నారు. అంబర్‌పేటలో 14.16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బతుకమ్మకుంటను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కుంట వద్దకు చేరుకున్న సీఎంకు మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. కబ్జాకు గురైన బతుకమ్మకుంటలో ఆక్రమణలు తొలగించిన హైడ్రా.. రూ.7.15 కోట్ల వ్యయంతో చెరువును పునరుద్ధరించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైడ్రాపై రూపొందించిన పాటను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కనుమరుగైన బతుకమ్మకుంటను పునరుద్ధరించిన హైడ్రాను అభినందించారు. ‘‘హైడ్రా ఆలోచన చేసినప్పుడు ప్రారంభంలో నన్ను విమర్శించారు. ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టినప్పుడు విమర్శలు సహజం. హైదరాబాద్‌కు చెరువులు, మూసీ నది గొప్పవరం. కానీ, చెరువులు, మూసీ నది కబ్జాకు గురై వరద సమస్య పెరిగింది. మూసీ అంటే.. మురికికూపం అన్నట్లుగా తయారైంది. మూసీ పరివాహకంలోని పేదల పట్ల నాకు అవగాహన, సానుభూతి ఉంది. పేదలకు మేలు చేయాలనే భావిస్తాను కానీ, నష్టం చేసే వ్యక్తిని కాదు. పేదల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నాం. మీరంతా సహకరిస్తేనే.. మీరు, మేము కోరుకున్నది సాధ్యం అవుతుంది. హైటెక్‌ సిటీ ప్రాంతంలో తుమ్మడికుంట కూడా ఆక్రమణకు గురైంది. తెలిసో ..తెలియకో.. హీరో నాగార్జున చెరువున్న భూమిలో కన్వెన్షన్‌ హాల్‌ కట్టారు. హైడ్రా కూల్చిన తర్వాత, వివరాలు చెప్పిన తర్వాత నాగార్జున వాస్తవం గ్రహించారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, విమలక్క, కార్పొరేషన్‌ చైర్మన్లు, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ రోహిన్‌ రెడ్డి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, ఉన్నతాధికారులు.
మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
అంబర్‌పేట్‌లో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్‌టీపీ) కేంద్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. నగరవ్యాప్తంగా రూ.4,739 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం 45 ఎస్‌టీపీల నిర్మాణం చేపడుతోంది. ఈ మేరకు డీపీఆర్‌లు రూపొందించింది. ఇప్పటికే పూర్తయిన ఆరు ఎస్‌టీపీలను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. మరో 39 కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మురుగునీటి శుద్ధి వ్యవస్థ గురించి జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి సీఎంకు వివరించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.