ప్రపంచ శ్మశాన వాటికగా ఫేస్‌బుక్!
లండన్: ఫేస్‌బుక్.. ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదోమో! రానున్న రోజుల్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటికగా మారనుంది. ఆశ్చర్యంగా ఉన్నా భవిష్యత్తులో జరగబోయేదిదే.. ప్రస్తుతం ఫేస్‌బుక్ ఖాతాదారుల్లో అత్యధికులు 2098 నాటికల్లా మరణిస్తారు. వాళ్లు మరణించినప్పటికీ చనిపోయిన వారి ఫేస్‌బుక్ ఖాతాలు మాత్రం అలాగే కొనసాగుతాయంటా.
ఒకవేళ వారి ఖాతాలు తొలగించాల్సి వస్తే వినియోగదారుల పాస్‌వర్డ్ తెలిసిన సన్నిహితులు అకౌంటును క్లోజ్ చేయొచ్చని అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ పీహెచ్‌డీ అభ్యర్థి హచెమ్ సాదిక్కి తెలిపారు. 2010లో 3,85,968 మంది, 2012లో 5,80,000 మంది ఫేస్‌బుక్ వినియోగదారులు మరణించారని కాగా ఈ ఏడాది 9,70,000 మంది మరణిస్తారని డిజిటల్ బియాండ్ అనే ఆన్‌లైన్ లెగసీ ప్లానింగ్ కంపెనీ అంచనా.