ప్రభుత్వము అందించే ఆర్థిక సహాయంతో ట్రాన్స్ జెండర్లు స్వయం ఉపాధి పొందాలి. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

ప్రభుత్వము అందించే ఆర్థిక సహాయంతో ట్రాన్స్ జెండర్లు స్వయం ఉపాధి పొందాలి. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 27 జనం సాక్షి.
సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంతో ట్రాన్స్ జెండర్లు స్వయం ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
బుధవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాలు నందు శిహు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ట్రాన్స్ జెండర్ లతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. జిల్లా లో 9 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని, వారికి ఓటు హక్కు ఉందా, ఆదార్ కార్డు ఉందా , మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నారు. అని వారి యొక్క పూర్తీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అందరుఫాం 6 ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ఆదార్ కార్డు కోసము దరకాస్తు చేసు కోవాలని అన్నారు.9 మందిలో ముగ్గురికి మాత్రమే ఓటు హక్కు ఉన్నదని తెలిపారు. మిగతా 6 మందికి ఓటు హక్కు ఫారం 6 లో నమోదు చేసేలా గద్వాల తాసిల్దార్ కు సూచించారు. వాళ్లకు సమాచారం ఇచ్చి వారిని ఆధార్, ఓటు హక్కు నమోదు చేయించాలన్నారు. హమాలీ కాలనీలో ఉంటున్నామని వారు కలెక్టర్ కు తెలుపగా ఆరు మాసాలపాటు ఎక్కడ ఉంటే అదే అడ్రస్ తో వారి ఆధార్ , ఓటు హక్కు నమోదు చేయాలన్నారు. వారిలో ఇద్దరు కర్నూలు నుంచి వస్తున్నారని, వారికి ఏపీ నుండి తెలంగాణకు ఏపి కార్డులను మార్పించాలన్నారు. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారని, మీరు జీవనాధారం ఏమిటని కలెక్టర్ అడగగా యాచక వృత్తి చేస్తున్నట్లు వారు కలెక్టర్ కి తెలిపారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ యాచకవృతిని విడనాడి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం రూ.50వేల నుండి రూ. 1 లక్ష వరకు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని జీవించాలని వారికి తెలిపారు. ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఐ డి కార్డు, స్వయం ఉపాది కోసం ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని వారికి తెలిపారు. అలాగే జిల్లాలో సెక్స్ వర్కర్లు ఎంతమంది ఉన్నారని, వారికి ఆధార్ ఓటర్ నమోదు ఉందా అని హోప్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.ఒకవేళ లేని పక్షంలో వారికి ఆధార్ ఓటర్ నమోదు దరఖాస్తు చేయించాలని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, శిశుసంక్షేమ అధికారి ముసాయిదా బేగం, డీఎస్ఓ రేవతి, హోప్ సంస్థ శేఖర్ ,లక్ష్మీనారాయణ ,ట్రాన్స్ జెండర్లు తదితరులు పాల్గొన్నారు.