ప్రభుత్వాన్ని నిలదీసేలా కార్యక్రమాలు

విద్యార్థులను సన్నద్దం చేస్తోన్న కమలనాథ్‌

భోపాల్‌,జూలై30(జ‌నం సాక్షి): మధ్యప్రదేశ్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ విపక్ష కాంగ్రెస్‌ పోరు తీవ్రం చేస్తోంది. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అన్ని మార్గాలను ఎంచుకుంటోంది. ఎక్కడిక్కడ ప్రభుత్వాన్‌ఇన నిలదీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా విద్యార్థులతో సమావేశాలు పెటట్‌ఇ వారను ప్రభుత్వాన్ని నిలదీసేలా కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కమల్‌నాథ్‌ చేపట్టారు. విద్యార్థులైన విూరంతా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటల్లోని నిజానిజాలను ప్రతీరోజూ 10 మందికి చెబుతామని సంకల్పించండని కమల్‌నాథ్‌ భోపాల్‌లో జరిగిన మధ్యప్రదేశ్‌ స్టూడెంట్‌ కాంగ్రెస్‌లో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. విద్య, విజ్ఞానాల మధ్య చాలా అంతరం ఉందని, విద్య అనేది జీవితంలో కొంతకాలమేనని, జ్ఞానం అనేది జీవితాతం మనల్ని వెన్నంటి ఉంటుందన్నారు. అయితే ఈ జ్ఞానమనేది విద్యార్థి దశలోనే మొదలవుతుందన్నారు. ఇక్కడి విద్యార్థులంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తారని నమ్ముతున్నానని అన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీకి చెందిన శివరాజ్‌ ప్రభుత్వ ప్రకటనల్లోని వాస్తవాలను విద్యార్థులు, ఉద్యోగులు బాగా అర్థం చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌,

బీజెపీల ఆలోచనా విధానాల్లో చాలా తేడా ఉందని, కాంగ్రెస్‌కు సమాజంలోని అన్నివర్గాల కష్టనష్టాలు తెలుసని పేర్కొన్నారు. అందుకే నిలదీయడం ద్వారా నిజాలు చెప్పించాలని సూచించారు.