ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులకు ప్రోత్సహించండి

–  జిల్లా మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుజాత
టేకులపల్లి, ఆగస్టు 3( జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నందున ప్రభుత్వ ఆసుపత్రులలోనే గర్భిణీ స్త్రీలకు కాన్పులు చేయించుకునే విధంగా ప్రోత్సహించాలని జిల్లా మాత శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుజాత అన్నారు. బుధవారం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కాన్పు కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సేవలను గర్భిణీలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు గ్రామాలలో ఉండే గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు చేయించుకోవడానికి అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించాలని సూచించారు . గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.ఈ సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు .ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ, PHNసత్యవతి, స్టాఫ్ నర్స్ వేదమణి తదితరులు పాల్గొన్నారు.