ప్రభుత్వ జూనియర్ కళాశాల గట్టు లో ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్స వేడుకలు

సెప్టెంబర్ 9 (జనంసాక్షి )   ప్రభుత్వ జూనియర్ కళాశాల గట్టు లో ప్రజాకవి కాలోజి నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు     కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ రెడ్డి ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ KSD రాజు కాలోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదేవిధంగా ఆయన తెలంగాణ భాష కోసం మరియు తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలను కొనియాడి ప్రజల కోసం ప్రజా గొంతుకై ,నా గొడవ అని రచన ద్వారా పోరాడిన వ్యక్తి అని ఆయన సేవలకు గుర్తింపుగా వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ యూనివర్సిటీగా ప్రభుత్వం నామకరణం చేసిందని విద్యార్థులకు సూచించారు  మండల పరిషత్ తహశీల్దారు కార్యాలయం గురుకుల పాఠశాల కస్తూరి భా గాంది.పాఠశాల లో కాళోఙి  చిత్రపటాన్ని కి పూలమాలలు వేసి   ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు          ఈ కార్యక్రమంలో యంపి పి విజయ కుమార్  యంపిడిఓ చెన్నయ్య యస్ఓ గుంటి గోపిలత  అధ్యాపకులు రాజగోపాల్ శ్యాంసుందర్  విష్ణు శేఖర్ మహేష్ మరియు అధ్యాపకేతర సిబ్బంది చందన మోహన్ రమేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు