ప్రభుత్వ దావఖానలో ఖాళీలు భర్తీ చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

 – వంగల రాగసుధ
జనం సాక్షి : నర్సంపేట
  పేద మధ్యతరగతి ప్రజల రోగాలను ఆసరా చేసుకుని కొంతమంది వైద్యులు అనుమతి లేకుండానే రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను, మెడికల్ షాపులను నిర్వహిస్తూ నిబంధనలు పాటించకుండా వైద్యం నిర్వహిస్తూ ఫీజుల పేరుతో విపరీతంగా డబ్బులు తీసుకుంటున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఏఐఎఫ్ డిడబ్ల్యు) రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగల రాగసుధ ఆరోపించారు. తక్షణమే ప్రైవేట్ ఆస్పత్రులు రోగనిర్ధారణ పరీక్షా కేంద్రాలు మెడికల్ షాపులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
   ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఏఐఎఫ్ డిడబ్ల్యు) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వంగల రాగసుధ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారిందని కనీస సదుపాయాలు లేక ప్రభుత్వ దావాఖానాలు వెలవెల పోతున్నాయని అందుకు ప్రత్యక్ష ఉదాహరణే నర్సంపేట ఆసుపత్రి అని పేరుకు జిల్లా ఆసుపత్రి అని ప్రకటించిన నేటికీ పూర్తిస్థాయిలో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు, వసతులు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరమని అన్నారు.
కరోనా నేపథ్యంలో పేద ప్రజలకు ప్రజల అనారోగ్యాలతో పెట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రులు విపరీతంగా దోచుకుంటున్నాయని హనుమతులేకుండానే రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో అర్హత లేని వారిని టెక్నిషయన్స్ గా నియమించి విపరీతంగా ఫీజులను దండుకుంటున్నారని అదే కోవాలో మెడికల్ షాప్ లను నిర్వహిస్తున్నారని మరికొన్ని హాస్పటల్లో స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ సైతం జరుగుతున్నట్లు చర్చ జరుగుతుందని ఇంత జరుగుతున్న జిల్లా వైద్యాధికారి, డ్రగ్ ఇన్స్పెక్టర్, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ నామమేత్రమైనని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ప్రైవేటు ఆసుపత్రులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిశ్రమలు జరిపి అనుమతులు లేకుండా అర్హతలు పాటించకుండా నిబంధనల విరుద్ధంగా నడిపిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు రోగనిర్ధారణ పరీక్ష కేంద్రాలు మెడికల్ షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక ఆర్టీవో కు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా డివిజన్ నాయకులు జన్ను జమున ఎన్ భవాని సునీత స్వరూప గణిపాక బిందు రామా ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.