ప్రభుత్వ దివ్యాంగ ఉద్యోగుల సమావేశాన్ని విజయవంతం చేయండి-ప్రధాన కార్యదర్శి కందనూలు నిరంజన్.

ప్రభుత్వ దివ్యాంగ ఉద్యోగుల సమావేశాన్ని విజయవంతం చేయండి-ప్రధాన కార్యదర్శి కందనూలు నిరంజన్.
నాగర్ కర్నూల్ ఆర్సీ సెప్టెంబర్ 27(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దివ్యాంగ ఉద్యోగుల సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ దివ్యాంగ ఉద్యోగుల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందనూలు నిరంజన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆదివారం ఉదయం 10గంటలకు సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో గల హరిహర కళాభవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దివ్యాంగ ఉద్యోగుల సంఘం(రాష్ట్ర డిఫరెంట్ ఏబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్)ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అభీబ్ మియా,అధ్యక్షతన ఈ సర్వసభ సమావేశం నిర్వహిస్తారని దివ్యాంగ ఉద్యోగుల సమస్యలు,ప్రమోషన్,పి ఆర్ సి,ఇతర అలవెన్స్,ఇంకా ప్రభుత్వం జారీ చేయవలసిన జీవోలు,భవిష్యత్తులో సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరుగుతుందని అన్నారు.కరోనా 2020తర్వాత ఈ సమావేశం నిర్వహిస్తున్నారని ప్రతి దివ్యాంగ ఉద్యోగి యొక్క సమస్యలు,సలహాలు,సూచనలు సంఘం స్వీకరిస్తుందని తెలిపారు.కావున ఈ సమావేశానికి నాగర్ కర్నూల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున దివ్యాంగ ఉద్యోగులు హాజరై ఈ కార్యక్రమని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.హైదరాబాదు బయలుదేరి వెళ్ళుటకు నాగర్ కర్నూల్ పాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆదివారం ఉదయం 6:30నిమిషాలకు వాహనం సిద్ధంగా ఉంటుందని అన్నారు.