ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలి

ప్రజా ప్రతినిధులు పాఠశాలలను సందర్శించాలి
— మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి వెళ్లాలి
— మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

టేకులపల్లి ,సెప్టెంబర్ 22( జనం సాక్షి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గ్రామాలలోని ప్రజలకు ప్రతి ఒక్కటి అందే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టి కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భూక్య రాధ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు శాఖల అధికారులతో మండలంలో జరిగిన ప్రగతి నివేదికలను వివరించారు. పాఠశాలలలో టాయిలెట్స్ లేక ఉపాధ్యాయురాలు, బాలికలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, మధ్యాహ్నం భోజనం పట్ల పర్యవేక్షణ కొరవడిందని, కొంతమంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, పర్యవేక్షణ లేమితో కుంటి సాకులు తెలుపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ మౌలానా ఎంఈఓ ను నిలదీశారు. మిషన్ భగీరథ వాటర్ ఇప్పటికీ చాలా గ్రామాలలో సరఫరా కావడం లేదని సభ్యులు నిలదీయడంతో మిషన్ భగీరథ అధికారులను జడ్పీ చైర్మన్ మందలిస్తూ టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే, చైర్మన్గా ఇద్దరం ఉండి కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తే బావుండదని, నిధులు అవసరమైతే ఎమ్మెల్యే దృష్టికి తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. సర్పంచులు ,ఎంపీటీసీలు గ్రామాలలో తిరిగి సమస్యలు తెలుసుకోవాలని ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుకుంటున్నాయా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పాఠశాలలను స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు సందర్శించి పర్యవేక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉందని అన్నారు .ఈ మండలానికి ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ ఉన్న �