ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన :డీపీవో దేవిక దేవి.

మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు.విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలు మురుగు పెరిగిపోవడం ఎంతవరకు సమంజసమని అధికారుల తీరు మార్చుకోవాలని డిపిఓ దేవిక దేవి మండిపడ్డారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చదువుల పట్ల కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరుస్తుంటే దౌల్తాబాద్ జెడ్పి పాఠశాలలో మురుగునీరు ప్రవహించడం ఏంటిదని అధికారులపై మండిపడ్డారు. అనంతరం జడ్పీ పాఠశాల ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న పనులు పలు అభివృద్ధి పనులను మరియు దీపం పల్లి గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి వేణుగోపాల్, ఎంపిడిఓ గపూర్ ఖాద్రి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ యాదగిరి, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు