ప్రభుత్వ పాఠశాలలే ఆధునిక దేవాలయాలు

ప్రభుత్వ పాఠశాలలే ఆధునిక దేవాలయాలు

టేకులపల్లి, సెప్టెంబర్ 27( జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతూ ఆధునిక దేవాలయాలుగా నెలకొల్పుతున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం 35 వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సూర్య ప్యాలెస్ ఎదురుగా ఉన్నస్థలం లో రెండు కోట్ల రూపాయల నిధులతో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు. సఖి బిల్లింగ్ కాంపౌండ్ వాల్ను ప్రారంభించారు.ప్రభుత్వ కూలి లైన్ పాఠశాలకు 15 లక్షల రూపాయలతో ప్రహరీ నిర్మాణం పనులు పూర్తి చేయడంతో ప్రారంభించారు.కూలి లైన్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో వనమా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలే ఆధునిక దేవాలాయాలు అని అన్నారు. పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా దేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మని వనమా అన్నారు. నా తుది శ్వాస వరకు ప్రజల కోసమే ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని
అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, స్థానిక కౌన్సిలర్ రుక్మాంగాధర్ బండారి, కోలాపూరి ధర్మరాజు, పరమేష్ యాదవ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కళ్యాణ్ శర్మ, రమాదేవి ,అరుణ, ఊహ, రజనీకాంత్ బండారి, పంది రాజు,పవన్, బాచి, ఖాళీ నరసింహ,కుమార్,మోహన్, ఆర్పీ రాజ్యలక్ష్మి, రూప బండారి, సృజన, రేణుక, శ్రీదేవి, సుచరిత, వార్డ్ పెద్దలు పాల్గొన్నారు.