ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించాలి* *SFI జిల్లా కార్యదర్శి కేలోత్ సాయికుమార్
*ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించాలి*
*SFI జిల్లా కార్యదర్శి కేలోత్ సాయికుమార్*
బయ్యారం,జూన్ 30(జనంసాక్షి):
భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్.ఎఫ్.ఐ) బయ్యారం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సాయికుమార్ హాజరై మాట్లాడుతూ…విద్యా సంవత్సరం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందించలేదని విమర్శించారు.జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 3 సబ్జెక్ట్ లు మాత్రమే పాఠ్యపుస్తకాలు అందించారని, మిగతా సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాలు ఇంకా ముద్రణ కూడా ప్రారంభం చేయలేదని మండిపడ్డరు. సమస్యల వలయంలో ప్రభుత్వ పాఠశాలలు చిక్కుకొని ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.16 మండలాలకు 5 రెగ్యులర్ ఎంఈఓ ను మాత్రమే ఉన్నారని తక్షణమే జిల్లాలో ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు, మంచినీరు, గదులు సరిపడాలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని అన్నారు. చాలీచాలని నిధులతో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారని,మధ్యాహ్నం భోజనానికి నిధులు పెంచి నాణ్యమైన భోజనం అందించాలని వారు కోరారు. మండల కార్యదర్శి బోడ అశోక్ మాట్లాడుతూ… మండలం లో ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలని అన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేసారు ఈనెల 4వ తేదీన విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఉందని విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో మండల నాయకులు రాజేష్,బసు,విద్యార్థులు పాల్గొన్నారు.