ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం పాఠ్య పుస్తకాలు అందించాలి ఏఐఎస్ఎఫ్
మహబూబాబాద్ బ్యూరో-జూలై7(జనంసాక్షి)
గార్ల మండలం ఏఐఎస్ఎఫ్ బడి బాట కార్యక్రమంలో భాగంగా గార్ల ఎంఇఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిండం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఇరుగు వెంకటేష్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా కాలిగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పాఠశాలలు ప్రారంభం అయ్యి దరిదాపు నెల కావస్తున్నా ఇంత వరకు 100 శాతం పుస్తకాలు అందించలేదు.వెంటనే వంద శాతం పుస్తకాలు అందించాలని కోరారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపిక అయిన పాఠశాలల పనులు ప్రారంభించాలని మిగతా పాఠశాలలు కూడా మన ఊరు మన బడి లో చేర్చి విద్యారంగాన్ని అభివృద్ధిచేయాలని డిమాండ్ చేశారు.అనంతరం ఎంఇఓ లేనందున ఆఫీస్ సిబ్బంది కి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గార్ల మండల కార్యదర్శి మాగం లోకేష్,భాస్కరా చారి తదితరులు పాల్గొన్నారు.