ప్రభుత్వ భూములు ఉన్నోళ్లకు ఇస్తారా.. లేనోళ్లకు ఇస్తారా.!

జనశక్తి నేత కూర రాజన్న.

పెద్దూరు వడ్డెరలకే ఎల్లమ్మ గుట్ట ఇవ్వాలి.

ఎల్లమ్మ గుట్ట వద్ద ” వడ్డెర మహాగర్జన” కు పిలుపు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 1. (జనంసాక్షి). ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేస్తారా పెట్టుబడిదారులకు ఇస్తారా అంటూ జనశక్తి నేత కూర రాజన్న సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు వడ్డెర కులస్తులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పిన్నింగ్ మిల్ భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. స్పిన్నింగ్ మిల్లును ఆనుకుని ఉన్న ఎల్లమ్మ గుట్టపై 300 పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు గుట్టను చదును చేస్తున్న విషయంలో వడ్డెరలు అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వానికి పలుసార్లు విన్నవించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృత్తిదారులకు చేయుత అందిస్తామని మాటల్లో చెబుతూ చేతల్లో మాత్రం వడ్డెరలకు ఉపాధి కల్పిస్తున్న గుట్టలను అక్రమార్కులకు కట్టబెడుతుందని ఆరోపించారు. జిల్లాలో వడ్డెరలకు ఉపాధి లేకుండా పోతుందని అన్నారు. సుమారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 20వేల మంది పైగా జిల్లాలో పదివేలకు పైగా వడ్డెర కులస్తుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం గుట్టలను వడ్డెర ఉపాధి కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. పెద్దూరు ఎల్లమ్మ గుట్ట ఎలాంటి షరతులు లేకుండా లేకుండా వడ్డెరకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎల్లమ్మ గుట్టను వడ్డెర కేటాయించాలని కోరుతూ రాష్ట్రంలో గుట్టలపై ఆధారపడ్డ వడ్డరులకు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎల్లమ్మ గుట్ట వద్ద “వడ్డెర మహా గర్జన” నిర్వహించాలని వడ్డెరలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలు పెద్దూరు వడ్డెర కులస్తులు పాల్గొన్నారు.

తాజావార్తలు