ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు 38,147 పోస్టులు..

కేంద్ర ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 38 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జులై 1 నాటికి ప్రభుత్వ రంగంలోని 12 బ్యాంకుల్లో 38,147 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాద్‌ తెలిపారు. ఇందులో క్లర్క్‌, ఆఫీసర్‌, సబ్‌ స్టాఫ్‌ పోస్టులు ఉన్నాయని చెప్పారు. లోక్‌సభలో ఎంపీ రాహుల్‌ అడిగిన ప్రశ్నకు గాను మంత్రి ఈ మేరకు వెళ్లడించారు. అత్యధికంగా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఎస్‌బీఐ తర్వాత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నదని వెల్లడించారు.

ఏ బ్యాంకులో ఎన్ని ఖాళీలంటే..

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- 2736 ఆఫీసర్‌ పోస్టులు, 621 క్లర్క్‌ పోస్టులు, 1948 సబ్‌ స్టాఫ్ పోస్టులు
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర- 134 ఆఫీసర్‌, 65 క్లర్క్‌, 36 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- 3778 ఆఫీసర్‌, 466 క్లర్క్‌, 1245 సబ్‌స్టాఫ్‌ పోస్టులు
కెనరా బ్యాంక్‌- 425 ఆఫీసర్‌, 356 క్లర్క్‌ పోస్టులు
ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌- 2004 ఆఫీసర్‌, 2129 క్లర్క్‌, 1610 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌- 162 ఆఫీసర్‌, 1253 క్లర్క్‌, 4603 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు
పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌- 600 ఆఫీసర్‌, 718 క్లర్క్‌ పోస్టులు
ఎస్‌బీఐ- 1425 ఆఫీసర్‌, 5000 క్లర్క్‌ పోస్టులు
యూకో బ్యాంక్‌- 64 ఆఫీసర్‌, 1386 క్లర్క్‌, 1609 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- 307 ఆఫీసర్‌, 573 క్లర్క్‌, 157 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు