ప్రభుత్వ విప్ నియోజకవర్గంలో దళితులకు రక్షణనేది?-సంకే రవి సీపీఎం జిల్లా కార్యదర్శి
దుర్గం బాపును కట్టేసి కొట్టిన సూరం రాం రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోనిబాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలిభవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం,ప్రభుత్వ అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలి.దుర్గం బాపు కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పిన సీపీఎం బృందం.భారీ ర్యాలీతో పోలీస్ స్టేషనకోటపల్లి మండలం శెట్టిపల్లి గ్రామంలో తమ పేరడీలోని చిక్కుడు చెట్లు ఎడ్లు తిన్నయని దుర్గం బాపుకు చెందిన ఎడ్లను సూరం రాం రెడ్డి తన ఇంటివద్ద కట్టి వేయడం జరిగింది.తన ఎడ్లను విడిపించుకొని వెళ్లిన దుర్గం బాపును రాంరెడ్డి తన ఇంటికి వచ్చి మెడలో ఉన్న టవాలతోటి ఒక పశువును గుంజుకచ్చినట్టు గుంజుక పోయి బర్ల మట్టుకు కట్టేసి కొట్టడం చూస్తుంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు దళితులపైన దాడులు జరుగుతున్నాయో అర్దం అవుతున్నాయి. దళిత నియోజకవర్గంలో దళితులకే రక్షణ లేకుండా పోతుంది. ఇదే నియోజకవర్గంలో మందమర్రి మండలం మామిడిగట్టులో ఒక దళితుని పైన దాడి జరిగింది.జైపూర్ మండలం గంగిపల్లిలో దళితులపై దాడి జరిగింది.కోటపల్లి మండలం సిర్స్ గ్రామంలో ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని వెన్నెల అనే దళిత అమ్మాయి మరణానికి అగ్రవర్ణాలవారు కారణమైనారు. లింగన్నపేటలో ఒక దళిత బాలికను చంపేయడం జరిగింది.నేడు దళితున్ని మట్టుకు కట్టేసి కొట్టడం జరిగింది.ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్లని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తుంది.మంచిర్యాల జిల్లాలో ఒక ఆటవిక పద్ధతులు కొనసాగుతుంటే వాటిని అరికట్టే దాంట్లో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలం చెందడం జరిగింది. ప్రతి నెల చివరి రోజు ప్రతి గ్రామంలో సామాజిక అంశాల పైన ప్రజలకు అవగాహన కల్పించాలని చట్టం చెప్తుంటే ఈ జిల్లాలో ఒక్క మండలంలో, ఒక్క గ్రామంలో కూడా అమలు కావడం లేదు.దీన్ని బట్టి చూస్తేనే దళితులంటే అధికారులకు,ప్రభుత్వానికి ఎంత చులకనుందో అర్థమవుతుంది.దళితుల అభివృద్ధి కొరకు దళిత బంధు అమలు జరుపుతున్నామని చెబుతున్నపాలకులు.నేడు అదే దళితులపైన దాడులు జరుగుతుంటే ఎందుకు అరికట్టలేకపోతున్నారని చెప్పి సిపిఎం ప్రశ్నిస్తుంది. దుర్గం బాపు పైన దాడి చేసి, కొట్టి అవమానపరిచిన సూరం రామిరెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగంపైన ఉంది. అదేవిధంగా ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన అవగాహన కార్యక్రమాలు అన్ని మండలాల్లో,గ్రామాల్లో ప్రతినెల నిర్వహించాలని, భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు పునరాతం కాకుండా చూడాలని లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని.ఈ సందర్భంగా ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఎండి అవేజ్ సీపీఎం చెన్నూరు పట్టణ కార్యదర్శి,కావేరి రవి సీపీఎం కోటపల్లి మండల కార్యదర్శి,డూర్కే మోహన్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మరియు సిపిఎం నాయకులు గడ్డం పోసక్క, ఉమారాణి,దాసరి సంధ్య, మారయ్య,నగేష్,బండారి రాజేశ్వరి,సుందిల్ల రాజేశ్వరి, రుక్సానా,మధు,రమ్య,RM ఖాన్,బండారి శ్రీనివాస్, రేణుక,ప్రసన్న,రజిత సౌందర్య,మంజుల,రమేష్, శంకర్,మధుకర్,జక్కయ్య, రాజన్న,పద్మ,లక్ష్మి,G.రాజేశ్వరి