ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం..!

` పాఠశాలలకు సెలవుల పొడిగింపు
` వాయు నాణ్యత క్షీణిస్తుండటంతో కేంద్రం అప్రమత్తం
` ట్రక్కులకు నో ఎంట్రీ.. నిర్మాణాలపై నిషేధం విధింపు
` మినీ లాక్‌డౌన్‌లా అనుసరించాలంటున్న ఆరోగ్య నిపుణులు
ఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధాని వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. నవంబర్‌ ప్రారంభం నుంచి రోజు రోజుకు పరిస్థితి దిగజారుతున్నది. రాబోయే దీపావళి పండగకు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వాయు కాలుష్యం పెరుగుతుండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలామంది శ్వాసకోశ, దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో మరిన్ని సమస్యలను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఢల్లీిలో ఆదివారం గాలి నాణ్యత సూచి దాదాపు 480కి పెరిగింది. ఢల్లీి నేషనల్‌ క్యాపిటర్‌ రీజియన్‌లో ఎక్యూఐ దాదాపు 500 కంటే ఎక్కువగానే ఉన్నది. దీపావళి పండుగకు ముందే ప్రజలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాయు కాలుష్యం పిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు కాలుష్యం పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం ఆంక్షలు అమలులోకి తీసుకువస్తున్నది. రాబోయే 15`20 రోజులు ఛాలెంజింగ్‌ పరిస్థితులుంటాయి.. దాంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.దేశ రాజధానిలో వాయు కాలుష్యం నిరంతరం పెరుగుతున్నది. కాలుష్యం నేపథ్యంలో నవంబర్‌పదో తరగతి వరకు పాఠశాలలను మూసివేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు. 6`12 తరగతులకు ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలో బోధించేందుకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. కాలుష్యం తారాస్థాయికి చేరుకోవడంతో శుక్రవారం ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జాతీయ రాజధాని పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అధ్వాన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ ముందు జాగ్రత్తగా మినీ లాక్‌డౌన్‌ను అనుసరించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.నోయిడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఎన్‌ఆర్‌ సహాయ్‌ మాట్లాడుతూ కాలుష్యం అందరికీ ప్రమాదకరమేనన్నారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకపోయినా కాలుష్యం నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. వాయు కాలుష్యంతో చాలా మందిలో శ్వాసకోశ సమస్యల బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికి వారే మినీ లాక్‌డౌన్‌ను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం పగటిపూట ఇంట్లోనే ఉండాలని.. కాలుష్య కారకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు తలుపులు, కిటికీలు మూసివేయాలని సూచించారు. బయటకు వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లయితే.. మాస్క్‌ను తప్పకుండా ధరించాలని సూచించారు.అన్ని వయసుల వారిలోనూ కాలుష్యం ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయని డాక్టర్‌ సహాయ్‌ పేర్కొన్నారు. పెరుగుతు కాలుష్యం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై సైతం ప్రభావం చూపుతుందని, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. గర్భిణి శ్వాస ద్వారా టాక్సిన్స్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయని.. అవి రక్తం ద్వారా ప్లాసెంటా, పిండంలోకి చేరుతాయన్నారు. దాంతో పిల్ల అభివృద్ధిని ప్రభావితం చేయడంతో పాటు వారిలో అనేక రకాల పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు.గాలి నాణ్యత సూచీ 450`500 ఉన్న సమయంలో గాలిని పీల్చడం ద్వారా శరీరానికి 25 నుంచి 30 సిగరెట్లు తాగినంత హాని జరుగుతుందని.. తద్వారా శ్వాస సమస్యలు పెరుగుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వాయు కాలుష్యంతో తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, ఉబ్బసం, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలకు కారణమవుతుందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఢల్లీిలో ఓపీడీలో శ్వాసకోశ సమస్యలతో పిల్లలు బాధపడుతున్న కేసులు పెరిగాయి. కాలుష్యం దీర్ఘకాలిక వ్యాధులకు కాలుష్యం కారణమవుతుందని, తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు కాలుష్యం బారినపడకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
పాఠశాలలకు సెలవుల పొడిగింపు
దేశ రాజధాని దిల్లీ లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలలకు సెలవులను మరో ఐదు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో నవంబరు 5 వరకు ఇచ్చిన సెలవులను.. తాజాగా నవంబరు 10వ తేదీ వరకు పొడిగించింది. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ‘‘దిల్లీలో వాయు కాలుష్య తీవ్రత పెరుగుతుండటంతో ప్రాథమిక పాఠశాలలకు నవంబరు 10 వరకు సెలవులు పొడిగిస్తున్నాం. ఆరు నుంచి ఆపై తరగతుల వారికి యథావిధిగా క్లాసులు నిర్వహించుకోవచ్చు. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించే అవకాశం కూడా ఇస్తున్నాం’’ అని దిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషీ తెలిపారు.ఆదివారం దిల్లీలో వాయు నాణ్యత సూచీ 486గా ఉంది. శనివారంతో (504గా ఉంది) పోలిస్తే స్వల్పంగా తగ్గింది. గత ఆరు రోజులుగా దేశ రాజధానిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు దిల్లీలో విషవాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలోనే ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (చిఊూ) జారీ చేసిన ప్రమాణాల కంటే 80 రెట్లు అధికం. ఈ గాలిని పీల్చడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి.
ట్రక్కులకు నో ఎంట్రీ.. నిర్మాణాలపై నిషేధం: కేంద్రం ఆదేశాలు
దేశ రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచీలు క్షీణిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. వాయు కాలుష్య నియంత్రణకు  నాలుగో దశ కింద కఠిన చర్యల్ని ప్రకటించింది. దిల్లీలోకి అత్యవసర సేవలను అందించే వాహనాలు మినహా వాయు కాలుష్య కారక ట్రక్కులు, నాలుగు చక్రాల కమర్షియల్‌ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించింది. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సీఎన్జీ, ఎలక్ట్రిక్‌, బీఎస్‌ పఎ వాహనాలను మాత్రమే రాజధాని ప్రాంతంలోకి అనుమతించాలని సూచించింది. హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఓవర్‌బ్రిడ్జ్‌లు, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, పైప్‌లైన్‌లు తదితర పబ్లిక్‌ ప్రాజెక్ట్‌లతో పాటు అన్ని రకాల నిర్మాణం, కూల్చివేత కార్యకలాపాలపై  నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య నియంత్రణకు అన్ని అత్యవసర చర్యలు అమలు చేయాలని దిల్లీ, రాజధాని ప్రాంతం పరిధిలోని రాష్ట్రాలను కోరింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సిబ్బందితో, మిగతా సిబ్బంది ఇంటి నుంచి పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో మూడు నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. ఈ జాబితాలో దేశ రాజధాని దిల్లీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతేగాకుండా టాప్‌` 10లో భారత్‌ నుంచే మూడు నగరాలు ఉండటం గమనార్హం. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్‌ గ్రూపు వెల్లడిరచిన డేటా ప్రకారం.. దిల్లీలో వాయు నాణ్యత సూచీ ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. ఈ జాబితాలో  మూడో స్థానంలో కోల్‌కతా, ఆరో స్థానంలో ముంబయి ఉన్నాయి.