ప్రమాదకర మూలమలుపు వద్ద చెట్ల తొలగింపు
కరీంనగర్,మార్చి3(జనంసాక్షి): సైదాపూర్, దుద్దెనపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారి మూలమలుపునకు ఇరువైపుల గల చెట్లను పోలీసుశాఖ ఆధ్వర్యంలో తొలగించారు. ఈ మూలమలుపు వద్ద చెట్లు పెరగడంతో రహదారి కనిపించక పలు ప్రమాదాలు జరిగాయి. దీంతో పోలీసుశాఖ స్పందించి చెట్లను తొలగించారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేస్తామని ఎస్సై రవి తెలిపారు. ఇదిలావుంటే సైదాపూర్ మండలం సోమారం గ్రామంలో గ్రామసందర్శన కార్యక్రమాన్ని పురస్కరించుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. పలు ప్రధాన వీధుల్లో చెత్తను వూడ్చి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పంతంగి అరుణ, ఎంపీటీసీ సభ్యురాలు వనిత, ఎంపీడీవో పద్మావతి, ఎంఈవో తిరుపతిరెడ్డి, పలుశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.