ప్రమాదాల నివారణకు ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
తూప్రాన్ జనం సాక్షి జూన్ 5 : ప్రమాదాలను తగ్గించడానికి జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రథమ స్థానంలో ఉందనిజి.యం.ఆర్ పోచంపల్లి ఎక్సప్రెస్ వేస్ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం జీడిపల్లి శివారులో ఆటో డ్రైవర్లకు పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించి కళ్లద్దాలు అవసరం ఉన్న 108 మందికి ఉచితంగా అద్దాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు
ప్రమాదాల నిష్పత్తిని తగ్గించడానికి మరియు జాతీయ రహదారులపై సురక్షితమైన డ్రైవింగ్‌ను నిర్ధారించే ప్రయత్నంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలమేరకు అజాది కా అమ్రిత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, జి.యం.ఆర్ పోచంపల్లి ఎక్సప్రెస్ వేస్ లిమిటెడ్, మనోహరబాద్ పోలీస్ , మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో మనోహరబాద్ మండల పరిధిలో గల జీడిపల్లి ట్రక్ పార్కింగ్ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. గత 15 సంవత్సరాలుగా జీఎంను వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని జి.యం.ఆర్ పోచంపల్లి ఎక్సప్రెస్ వేస్ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ మరియు మనోహరబాద్ ఎ. ఎస్ ఐ చంద్రమోహన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ అవగాహన లోపం కారణంగా చాలా మంది డ్రైవర్లు సంవత్సరానికి ఒకసారి కూడా కంటి పరీక్షలు చేయించుకోవడం విస్మరిస్తున్నారని, రోడ్డు ప్రమాదాలకు కంటిచూపు మందగించడం కూడా కారణమని తెలియజేసారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు వేణుప్రసాద్ , ఉమెర్, మరియు విశాల్ ఆధ్వర్యంలో దాదాపుగా 200 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, 108 మంది డ్రైవర్లకు కళ్ళ అద్దాలను పంపిణీచేశారు. అలాగే 12 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు నిర్ధారించగా పుష్పగిరి కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేయించనున్నట్లు కోఆర్డినేటర్ వేణు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారిని మనోహరబాద్ ఎస్.ఐ రాజు గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.వి ప్రతినిధి హజరత్ రెడ్డి, చిరంజీవి, జి.యం.ఆర్ సంస్థ ప్రతినిధులు వెంకటరమణ, నాగేశ్వర్ రావు, ప్రవీణ్ కుమార్, సతీష్ పట్నాయక్ , వసంత్ సాయి, రక్ష సిబ్బంది ,పుష్పగిరి కంటి ఆసుపత్రి సిబ్బంది, మనోహరబాద్ పోలీస్ సిబ్బంది మరియు డ్రైవర్లు పాల్గొన్నారు.