ప్రమాదాల నివారణకు పోలీసుల యత్నం

విశాఖపట్టణం,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగ సందర్భంగా జాతీయ రహదారిపై వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న వాహన చోదకులకు పోలీసులు ప్రమాదాల నియంత్రణపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. విశాఖ, విజయవాడ మార్గంలో శనివారం నుంచి భారీగా వాహన రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో కార్లు, ద్విచక్ర వాహనాలు అమితమైన వేగంతో వెళ్తున్న చోదకులను అప్రమత్తం చేయటానికి నక్కపల్లి పోలీసులు ఉపక్రమించారు. ఎస్సైలు సింహచలం, కుమార స్వామి, రాజు పోలీసు సిబ్బందితో కలిసి భారీగా గులాబి పూలు చేతపట్టి ప్రచారం సాగించారు. అనంతరం వాహనాలను ఆపి చోదకులకు వీటిని పంచుతూ వేగం ముఖ్యం కాదని సురక్షిత ప్రయాణం చేయలంటూ కోరారు. దీంతో చోదకులంతా వారికి కృతజ్ఞతలు తెలిపి ఆనందంగా వెళ్లారు.