ప్రమాద నివారణకు చర్యలు
తిరుపతి,జూలై28(జనం సాక్షి): తిరుపతి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల పరిధిలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను గుర్తించి బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ రహదారిపై రోడ్ సేఫ్టీ టీంను ఏర్పాటు చేశారు. కుప్పం సిఐ రాఘవన్ ఆధ్వర్యంలో ప్రమాదాలు జరగకుండా శనివారం చర్యలు తీసుకున్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని, అలా ధరించకుండా ప్రయాణించేవారికి భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రోడ్ సేఫ్టీ టీం ఇటీవల ప్రమాదాలు జరిగిన చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదకర స్థలం గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి బారికేడ్లకు స్టిక్కర్లను అతికించే ఏర్పాటు చేశారు. ఈ రోడ్ సేఫ్టీ టీమ్ లో కుప్పం హెడ్ కానిస్టేబుల్ ఇనాయతుల్లా, కానిస్టేబుళ్లు నరసింహ, తమిళరసన్ కుమార్, ¬ంగార్డ్ అస్గర్‌అహ్మద్‌లు పాల్గొన్నారు.