ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):రాష్ట్ర పోలీసు నియామక బోర్డు అధ్వర్యంలో ఆదివారం జరిగిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్  తెలిపారు.జిల్లాలో ఏర్పాటు చేసిన 23 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు సకాలంలో హాజరై పరీక్ష రాసినారు.8637 మంది అభ్యర్థులకు గాను 8160 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా  437 మంది ఆబ్సెంట్ అయినట్లు చెప్పారు.ప్రత్యేక బందోబస్తు మధ్య పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇద్దరు డీఎస్పీ లు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేశారని తెలిపారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం  జిల్లా నోడల్ అధికారిగా పర్యవేక్షణ చేశారని అన్నారు.సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశులు, కోదాడ  కెఆర్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాగు ఇద్దరు పరీక్ష రీజినల్ కో-ఆర్డినేటర్స్ గా పని చేసినట్లు తెలిపారు.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పరీక్ష ముగిసిందన్నారు.పరీక్ష నిర్వహణలో పని చేసిన పోలీసు సిబ్బంది, కళాశాల సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు.కోదాడ డీఎస్పీ
వెంకటేశ్వర రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది విధులు నిర్వర్తించారు.
 *అభ్యర్థులు ఎవ్వరూ మోసపోవద్దు……*
పరీక్షా కాలాన్ని , ఉద్యోగ నియామకాలను అదునుగా చేసుకుని కొంతమంది మోసగాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్తారని ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న అభ్యర్థులు ఇలాంటి మాయ మాటలకు లోబడి మోసపోవద్దని ఎస్పీ రాజేంద్రప్రసాద్ కోరారు.రాష్ట్ర పోలీసు నియామక సంస్థ అధ్వర్యంలో పారదర్శకంగా నియామకాలు జరుగుతాయని, ఉద్యోగాలు ఇప్పిస్తామని అంటే డబ్బులు కట్టవద్దు, ఇలాంటి వారు ఎవరైనా మిమ్ములను ప్రలోబాలకు గురి చేస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు.