ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన శోభయాత్రను నిర్వహించుకోవాలి ఎస్ఐ వీరబాబు కొండమల్లేపల్లి సెప్టెంబర్ 26 జనం సాక్షి :

కొండమల్లేపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కొండమల్లేపల్లి ఎస్ఐ వీరబాబు సూచించారు ఎవరైనా మద్యం మత్తులో, పాత కక్షలతో, ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినా, ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసినా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ వీరబాబు మాట్లాడుతూ
గణేష్ నిమజ్జనము రోజున పోలీస్ శాఖ వారు సూచించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు నిమజ్జనం రోజున వినాయక విగ్రహములను తీసుకొనివెళ్లే వాహనములలో ఆయుధాలు,మందుగుండు సామగ్రి, టపాకాయలు,మండే స్వభావం కలిగిన పదార్ధాలు అనగా పెట్రోలు, డీజిల్ మొదలగునవి పెట్టరాదన్నారు నిమజ్జనం రోజున విగ్రహలను తీసుకొని వెళ్లే వాహనాల మరియు డ్రైవర్ల యొక్క పూర్తి వివరాలు పోలీసు వారికి తెలియజేయాలని వాహనం మంచి కండిషన్ లో ఉండే విధంగా చూసుకోవాలన్నారు ఎలాంటి వదంతులను నమ్మకూడదని, ఏదైనా సమాచారం తెలిసినా, అసత్య ప్రచారాలు చేసినా అలాంటి వ్యక్తుల వివరాలను డయల్ 100 ద్వారా లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్నారు గణేష్ మండపం వద్ద గాని, ఊరేగింపులో గాని ఎలాంటి బాణాసంచా పేల్చకుండా మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నిమజ్జనం రోజున నిమజ్జనంలో పాల్గొనే వారు ఎలాంటి మత్తు పదార్థాలు సేవించకుండా నిర్వాహకులు జాగ్రత్తపడాలని తెలిపారు గణేష్ నిమజ్జనం రోజున ఊరేగింపులో ఎవ్వరు కూడా కర్రలు, తల్వార్లు, కత్తులు మరే ఇతర మారణాయుధాలు కలిగి ఉండరాదన్నారు ఊరేగింపులో ఎర్ర రంగు, కుంకుమ, గులార్ మొదలైన రంగులను దారిన పోయే వారిపై చల్లకూడదని తెలిపారు ఊరేగింపులో డి.జె. లను వినియోగించవద్దని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి డి.జె.లు వినియోగిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు సంబందిత నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సూచించారు నిమజ్జనం చేయు సమయంలో పోలీసు వారు ఉత్తర్వులు పాటిస్తూ నీళ్లలోకి ఎక్కువ లోతుకి వెళ్లకుండా పెద్దవారు మాత్రమే వెళుతూ పిల్లలని ఇతరాని వాళ్ళను నీళ్లలోకి దింపకుండా జాగ్రత్త పడాలన్నారు నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్దలతో భక్తులచే పూజినందుకున్న గణనాథుడి శోభాయాత్ర సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు