ప్రశ్నిస్తే వేటువేస్తారా?

టీటీడీ నిర్ణయం సరికాదు: ఐవైఆర్‌
హైదరాబాద్‌,మే18(జ‌నం సాక్షి): టీటీడీలో నిర్వహించే కైంకర్యాలు జీవిత కాలానికి సంబంధించినవని, అటువంటి దైవికమైన కార్యక్రమానికి లౌకికమైన ఉద్యోగంలా పదవీ విరమణ నిర్ణయించటం సరికాదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి,టిటిడి మాజీ ఇవో  ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. ఈ మేరకు బుధవారం టీటీడీ ఈవోకు ఆయన లేఖ రాశారు. తిరుపతిలో ఉండే అర్చకులు స్కేల్‌ ఆఫ్‌ పే పొందలేదు కాబట్టి వారికి ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, పదవీ విరమణ తర్వాత వచ్చే సౌకర్యాలు ఉండవని పేర్కొన్నారు. 65 ఏళ్లకి వారిని పదవీ విరమణ చేయాలనడం సరికాదన్నారు. వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సుప్రీంకోర్టు అనుమతితో ధార్మిక పరిషత్‌కు మాత్రమే ఉంటుదని వివరించారు. దేవాలయాలలో నిర్వహించే కైంకర్యాలు జీవిత కాలానికి సంబంధించినవి. శారీరకంగా మానసికంగా శక్తి ఉన్నంత కాలం ఈ కార్యాలు నిర్వహించ వచ్చు. ఇటువంటి దైవికమైన కార్యక్రమానికి లౌకికమైన ఉద్యోగంలాగా పదవీ విరమణ నిర్ణయించటం సరికాదన్నారు. టిటిడి అర్చకుల  కొనసాగింపు విధానాన్ని బోర్డు ఆమోదం పొందిన తర్వాత తాను ఇవోగా  ఉన్న పుడుధార్మిక పరిషత్‌ ఆమోదంతో ఒక స్కీము తయారు చేసానని అన్నారు. ఆ స్కీముప్రకారమే వీరు వారి పదవుల్లో కొనసాగుతున్నారు. ఆ స్కీమును ఆమోదించి వారు కూడా సుప్రీంకోర్టులోని వారి వ్యాజ్యాన్ని ఈ విషయం తెలియజేసి ఉపసంహరించుకోవడం జరిగింది. ఏదైనా వారిపై నిర్ణయం తీసుకునే అధికారం ధార్మిక పరిషత్‌కి సుప్రీం కోర్టు అనుమతితోమాత్రమే ఉంది. కానీ ఈ ప్రభుత్వం కారణాలు ఏమో
తెలియదు కానీనాలుగేళ్ల నుంచి ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేయలేదు. అటువంటి పరిస్థితులలో అర్చకులను తొలగించే అధికారం బోర్డు కు ఉండదన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే సమంజసమైన ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పాల్సింది పోయి,  వేటు వేయడమే తమ లక్ష్యంగాపెట్టుకున్నట్లు కనిపిస్తున్నది.ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు.