ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకరీచ్‌లను గుర్తించండి

C

– మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ సమీక్ష

హైదరాబాద్‌,జులై 9(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కు అవసరమైన ఇసుక రీచ్‌ లను యుద్ధప్రాతిపదిక న గుర్తించాలని మంత్రులు హరీష్‌ రావు , కెటిఆర్‌ ఆదేశించారు. ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులతో  సెక్రటేరియట్‌ లో శనివారంనాడు సవిూక్ష సమావేశం  నిర్వహించారు. జిల్లాల వారీగా  ఇసుక రీచ్‌ ల కు సంబంధించి రెండు రోజుల్లో మ్యాపింగ్‌ చేయాలని కోరారు. ప్రాజెక్టులకు సవిూపంలోని ఇసుక వనరు ను గుర్తించాలన్నారు . సాగునీటి ప్రాజెక్టులు, ప్యాకేజీల వారీగా  ఇసుక అవసరాలను హరీష్‌ రావు , కెటిఆర్‌ సవిూక్షించారు. ఆదిలాబాద్‌ జిల్లా పెన్‌ గంగ నుంచి కరీంనగర్‌ జిల్లా గౌరవల్లి, గండి పల్లి వరకు, వరంగల్‌ జిల్లా దేవాదుల, నల్లగొండ జిల్లా ఎఎంఆర్పి, పెండ్లి పాకల, ఉదయ సముద్రం, డిండి

తదితర ప్రాజెక్టులు …. ఇటు ఆన్‌ గోయింగ్‌ మొదలుకొని కొత్తగా రీ ఇంజనీరింగ్‌ లో చేపట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం తదితర ప్రాజెక్టులకు మొత్తం కోటి 72 లక్షల క్యూబిక్‌ విూటర్ల అవసరమని నిర్ధారించారు.  ఈ సందర్భంగా నీటిపారుదల మంత్రి హరీష్‌ రావు ను ఐటి మంత్రి కెటిఆర్‌ కొనియాడారు.  హరీష్‌ సమర్ధ నాయకత్వంలో మైనింగ్‌ శాఖ ఆదాయం 45 శాతం పెరిగిందన్నారు. ఈ యేడాది రెట్టింపు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కె టిఆర్‌  తెలిపారు. మిడ్‌ మానేరు లో ఈ యేడాది 3 టిఎంసిల నీటిని నిల్వ చేయాలనుకుంటున్నందున వీలైనంత త్వరగా ఇందులోని ఇసుకను ప్రాజెక్టుల కు తరలించాలని ఇద్దరు మంత్రులు ఆదేశించారు. కాళేశ్వరం ప్యాకేజీ 9, రంగనాయకిసాగర్‌, అనంతగిరి ప్రాజెక్టులకు మిడ్‌ మానేరు నుంచి 7 లక్షల క్యుబిక్‌ విూటర్ల ఇసుకను 45 రోజుల్లో తరలించాలని  నిర్ణయించారు.  ఇసుక తరలింపులో అక్రమాలను నిరోధించాలని, అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. అవసరమైతే  ఇసుక రీచ్‌ నుంచి ప్రాజెక్టు కు ఇసుకరవాణా చేసే ట్రక్కులు , ఇతర వాహనాలకు జియో ట్యాగింగ్‌ చేయాలని మంత్రులు కెటిఆర్‌ , హరీష్‌ రావు సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసు, రెవిన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని మైనింగ్‌, ఇరిగేషన్‌ అధికార యంత్రాంగాన్ని కోరారు.రీ ఇంజనీరింగ్‌ కింద చేపట్టిన ప్రాజెక్టులను వ్యాకేజీల వారీగా మంత్రి హరీష్‌ రావు సవిూక్షించారు. ప్రధానంగా ప్రాజెక్టుల భూసేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరారు. భూసేకరణ సమస్యలను అధిగమించడానికి రెవిన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని కోరారు.  పెర్ఫార్మెన్స్‌ సరిగ్గా లేని కిందిస్థాయి సిబ్బందిని, ఇంజనీర్లను మార్చి తమ డచ39;టీమ్‌డచ39; లోకి ఎవరు కావాలో తీసుకోవచ్చని ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్లను మంత్రి హరీష్‌ రావు కోరారు. ఇకపై ఏ విషయానికైనా సి. ఇ లే జవాబుదారుల ని మంత్రి అన్నారు..మరోవైపు, భూసేకరణ సమస్యలను అధిగమించడానికి రెవిన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని మంత్రులు సూచించారు. పెర్ఫార్మెన్స్‌ సరిగ్గా లేని కిందిస్థాయి సిబ్బందిని, ఇంజనీర్లను మార్చి తమ ‘టీమ్‌’ లోకి ఎవరు కావాలో తీసుకోవచ్చని ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్లకు సూచించారు. ప్రాజెక్టుల్లో ఆలస్యం తదితర కారణాలకు చీఫ్‌ ఇంజనీర్లే జవాబుదారీ వహించాలన్నారు.సవిూక్ష సందర్భంగా నీటిపారుదల మంత్రి హరీష్‌ రావును ఐటి, పరిశ్రమల మంత్రి కేటిఆర్‌ కొనియాడారు. హరీష్‌ సమర్థ నాయకత్వంలో మైనింగ్‌ శాఖ ఆదాయం 45 శాతం పెరిగిందన్నారు. ఈ యేడాది రెట్టింపు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎస్కె. జోషి, అరవింద్‌ కుమార్‌, ఇరిగేషన్‌ కార్యదర్శి వికాస్‌ రాజ్‌, టిఎస్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఇలంబర్తి, ఇరిగేషన్‌ ఇ.ఎన్‌.సి. లు మురళీధరరావు , విజయప్రకాష్‌, సి.ఇ .లు ఎన్‌.వెంకటేశ్వర్లు, బి.వెంకటేశ్వర్లు, హరిరామ, భగవంతరావు, అనిల్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.