ప్రాజెక్టులో ప్రమాదం.. ఒకరి మృతి

ఏలూరు,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో గుత్తేదారుల వద్ద సూపర్‌ వైజర్‌గా పనిచేస్తున్న డోకుల శ్రీనివాస్‌ (30) భారీ వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం రాత్రి ప్రాజెక్టు వద్ద పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన శ్రీనివాస్‌ను గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొంది. వెంటనే అక్కడ పనిచేసే సిబ్బంది హూటాహూటిన అతనిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించగా సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లువైద్యులు తెలిపారు. మృతుడు కొత్త పట్టిసీమ గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తాజావార్తలు