ప్రాజెక్టుల పూర్తిలో ముందున్నాం: దేవినేని

విజయవాడ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): పురుషోత్తమపట్నం,పట్టిసీమ ఎత్తిపోతలు పూర్తి చేయడం ద్వారా సాగునీటి రంగంలో అద్బుత విజయాలు సాధించామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హావిూమేరకు నీటిని విడుదల చేసి సిఎం చంద్రబాబు తన పట్టుదలను చాటారని అన్నారు. గోదావరి బేసిన్‌లో ఏటా మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలోకికలిసిపోతుండగా, కృష్ణా బేసిన్‌కు ఆలమట్టి నుంచి ఇంత వరకు చుక్క నీరు రాలేద న్నారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యం మేరకు గ్రావిటీ ద్వారా నీరు విడుదల, 2019 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేయాల్సిన గురుతర బాధ్యత ఇంజినీర్లపై ఉందని పేర్కొన్నారు. ఇదిలావుంటే చింతలపూడి ఎత్తిపోతల పథకంలో నష్టపోతున్న రైతులకు ఎకరాకు రూ.25 లక్షలు ఇవ్వాలని బాధితులు డిమాండ్‌ చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులతో చింతలపూడి లిఫ్‌ట్ట్‌ఇరిగేషన్‌ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ భూముల్లో పంటసాగుపైనే జీవనం సాగిస్తున్నామన్నారు. ఈ భూములు కోల్పోవడం వల్ల జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు ఏడున్నర లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెప్పడం అన్యాయమన్నారు. ఎకరాకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 

తాజావార్తలు