ప్రియుడి కోసం సెల్‌టవర్ ఎక్కిన ప్రియురాలు: ఆస్తి కోసం చెల్లెలి హత్య

కరీంనగర్: ప్రేమించిన ప్రియుడు మోసంచేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు సెల్ టవర్ ఎక్కింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, తల్లిదండ్రులు ఘటనాస్థలంకు చేరుకొని యువతిని కిందికి దించారు. పోలీసులు ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆస్తి కోసం చెల్లెలి హత్య  కరీంనగర్ జిల్లాలోని గొల్లపల్లి మండలం ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం చెల్లిని అన్న నరికి చంపాడు. చెల్లెలు రాజం లతను అన్న రాజంలింగయ్య గొడ్డలితో నరికి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. కారు-ఆటో ఢీకొని ఇద్దరు మృతి మెదక్ జిల్లాలోని సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.