ప్రియుడి మోజులో భర్త దారుణంగా హత్య
బుకాయించబోయి అడ్డంగా దొరికిన భార్య
లక్నో,జూలై20(జనంసాక్షి):ప్రియుడి మోజులో ఓ మహిళ ఏకంగా భర్తను చంపేసింది. తరవాత బుకాయించే యత్నం ఫలించక పోడంతో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోంది. భర్తను చంపిన షాకింగ్ విషయాలు పోలీసులు వెల్లడిరచారు. ప్రియుడితో కలిసి భార్యే భర్త సంజయ్‌ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యూపి జమాల్‌పూర్ షెఖన్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం సంజయ్ భార్య నిఖిత గత రెండేళ్లుగా వికాస్ అలియాస్ మోను అనే యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. దీంతో సంజయ్ వీరిద్దరినీ అనుమానించాడు. అయితే మోనుతో తనకు సంబంధం లేదని నిఖిత తన భర్తకు ఎప్పుడూ చెబుతుండేది. యితే సంజయ్ ఒకరోజు మోనుతో పాటు నిఖితను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. సంజయ్‌ని చూడగానే మోను అతనిపై దాడికి దిగాడు. సంజయ్ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే నిఖిత, మోనులు కలిసి సంజయ్‌ను గొంతు నులిమి హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని పారవేసేందుకు ఇద్దరూ కాలువ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే అక్కడ చాలా మంది జనం ఉన్నారు. దీంతో ఇద్దరూ ఒక పథకం ప్రకారం సంజయ్ మృతిపై కట్టుకథ అల్లి మృతదేహంతో ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ వారు… బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సంజయ్‌ని కొట్టి చంపారని చెప్పాడు. వీరి కట్టుకథలపై అనుమానం వచ్చిన పోలీసులు వారిని తమదైన శైలిలో విచారించారు. ఇద్దరూ పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. అయితే చివరకు తామే హత్య చేసినట్లు అంగీకరించారు. నికితను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తోహానా డీఎస్పీ షాకీర్ హుస్సేన్ తెలిపారు. నిందితుడు మోనును కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించిన తర్వాత తదుపరి విచారణ చేయనున్నామన్నారు.