ప్రీడం ర్యాలీని విజయవంతం చేయండి- దేశ భక్తిని చాటి చెప్పండి
భారతావనికి స్వాతంత్ర్యం సిద్దించి 75 వసంతాలు పూర్తి అయిన సందర్బంగా నేడు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలమేరకు స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో శుక్ర వారం పట్టణ ఎస్సై అశోక్, మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేడు ఉదయం ,8 గంటలకు స్థానిక సూపర్ బజార్ ఎన్.టి.ఆర్ చౌక్ నుండి ఫ్రీడం ర్యాలీ నీ కొనసాగిస్తూ అల్ఫోన్సా హైస్కూల్, తవక్కల్ హై స్కూల్, టిడిపి ఆఫీస్, గంగా కాలనీ, భగత్ సింగ్ నగర్ రిక్వెస్ట్ స్టాప్, గణేశ్ టెంపుల్ ల మీదుగా స్థానిక రాజీవ్ చౌక్ చేరుకొని, అనంతరం కూడలి వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ ఫ్రీడం ర్యాలీలో సబ్బండ వర్గాలు ,వివిధ పాటశాలల విద్యార్థులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, ఆటో యూనియన్, రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మహిళా సంఘాలు, ఆర్ పి లు, పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.