ప్రీ పీ హెచ్‌ డీ ఫలితాలు విడుదల

 

ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ ప్రీ పీ హెచ్‌ డీ ఫలితాలు విడుదలయ్యూయి. ఓయూ వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు పరీక్షల నియంత్రణ అదికారి డా. వెంకటేశ్వర్లు తెలిపారు. తప్పిన విద్యార్థులు 15 రోజుల్లోగా రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా ప్రీ పీహెచ్‌డీలో ఎక్కువ మందిని ఫెయిల్‌ చేశారని, పున:మూల్యాంకనం చేయాలని వీసీ ప్రో. సత్యనారాయణకు పులువురు పీహెచ్‌డీ విద్యార్థులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.

28 నుంచి ఇంజనీరింగ్‌ పీజీ పరీక్షలు

ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ పరిధిలో ఈ నెల 26 నుంచి వివిద పీజీ ఇంజనీరింగ్‌ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ ప్రో. బిక్షమయ్య తెలిపారు. పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్లో విద్యార్దులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కోన్నారు.