ప్రేమలత కి మాదాసి మాదారి కురువ సంఘం సంపూర్ణ మద్దతు
జోగులాంబ గద్వాల జిల్లా లోని మనోపాడు మండల మాదాసి మదారి కురువ సంఘం అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే ప్రేమలత పల్లయ్య ని భారీ మెజారిటీ తో గెలిపిస్తాం అని శనివారము మనోపాడు మండలంలోని అమరావాయి గ్రామంలో మండల స్థాయి మాదాసి మాదారి కురువ సంఘం వారు సమీక్ష సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురువ పల్లయ్య బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్నారనీ,ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ప్రేమలత ని కులాంతర వివాహం చేసుకున్నాడనీ ,వీరిద్దరూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయడం జరిగిందనీ,ఆరోజు అధిష్టానం సర్ది చెప్పడంతో ప్రేమలత పల్లయ్య నామినేషన్ను వెనక్కి తీసుకొని ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేశారనీ, అలంపూర్ నియోజకవర్గంలో నలభై వేల పైచిలుకు సంఖ్యలో మాదాసి మదారి కురువలు ఉన్నారనీ,మేమందరం 2018లో టిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి బీ ఆర్ ఎస్ పార్టీ ని గెలిపించామనీ ఈ తరుణంలో ప్రేమలత పల్లయ్య కి బీ ఫామ్ ఇస్తే పార్టీ భారీ మెజారిటీ తో పార్టీ గెలుస్తుందనీ, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి పల్లయ్య పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదనీ, అయన భార్యా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన ఉద్యమ నాయకురాలు ప్రేమలత పల్లయ్య కు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాము అని అన్నారు.సమీక్షా సమావేశంలో అలంపూర్ తాలూకా కన్వీనర్ కేశవరం మాజీ సర్పంచ్ ఠాగూర్ కృష్ణ, మనోపాడు మండల అధ్యక్షుడు రామకృష్ణ, బోరవెల్లి సీతారాముడు,చెన్నిపాడు శంకరయ్య, కోర్రిపాడు లక్ష్మి నారాయణ, పరుశరాముడు, అమరావాయి పక్కిరన్న, వెంకటేశ్వర్లు, జనార్దన్, రాఘవేంద్ర, గురుపాద, సుధాకర్,శ్రీను, గోవిందు, మదిలేటి, ఈశ్వర్ కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.